ఆ తీర్మానాలతో కేంద్రానికి దళపతి విజయ్ మార్క్ షాక్
జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల పైన కేంద్రానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకువస్తున్న వీటిని చాలా రాష్ట్రాలు స్ట్రాంగ్ గానే వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే వీటిని వ్యతిరేకిస్తూ తమిళగ వెట్రి కళగం పార్టీ నేడు పలు తీర్మానాలను చేసి ఆమోదించింది.
త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ పార్టీ తీర్మానం
నేడు తిరువన్మయూర్ లో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన సినీ హీరో విజయ్ పార్టీ టీవీకే ఈ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆమోదించింది. ఇక ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానంలో ఉన్న మూడు భాషల విధానం ఫెడరలిజంకు విరుద్ధంగా ఉందని టీవికే పార్టీ అభిప్రాయపడింది.

డీ లిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం
త్రిభాషా సూత్రాన్ని తమ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు తగ్గుతాయని చెప్పింది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఈ విధానాన్ని తాము అంగీకరించేది లేదని పేర్కొంది. నియోజక వర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఇక ఇదే సమయంలో తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకె ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు గుప్పించింది.
డిఎంకె ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు
ఉద్యోగుల పాత పెన్షన్ పథకంపై ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసిందని టీవీకే పార్టీ విమర్శించింది. ఇక రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని, దానిని నియంత్రించడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెల్లడించింది. శ్రీలంకలో అరెస్ట్ అయిన భారతీయ మత్స్యకారుల సమస్యను టీవీకే పార్టీ వదిలిపెట్టదని మత్స్యకారులకు అండగా ఉంటామని పేర్కొంది. ఇక మత్సకారుల కుటుంబాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది.
హీరో విజయ్ టీవీకే పార్టీ అడుగులు
అనేక కీలక అంశాలపై పార్టీ స్టాండ్ ను ఈ సమావేశంలో తీసుకుంది టీవీకే పార్టీ. మొత్తానికి వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసి రంగంలోకి దిగుతున్న హీరో విజయ్ టీవీకే పార్టీ తమిళనాట తన సంచలన నిర్ణయాలతో ప్రజల మద్దతు కోసం అడుగులు వేస్తుంది.












Click it and Unblock the Notifications