• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

NRC కోఆర్డినేటర్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు...అసలైన పౌరులను తొలగించారంటూ ఫిర్యాదు

|

గౌహతి: అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ జాబితా నుంచి నిజమైన భారతీయుల పేర్లు తొలగించడంపై కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలాపై గౌహతి, దిబ్రుగర్‌లలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కావాలనే తమ పేర్లను తొలగించారన్న ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. సెప్టెంబర్ 3 సాయంత్రం తొలి ఫిర్యాదు నమోదుకాగా ది అస్సోం గారియా మారియ యువ ఛత్ర పరిషత్ గౌహతిలోని లతాసిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. గారియా మారియా అనే రెండు అస్సామీస్ ముస్లిం వర్గాలకు ఈ సంస్థ చెందినది.

ఘోర పడవ ప్రమాదం: 34 మంది మృతుల్లో భారతీయ జంట, రెండేళ్ల క్రితమే పెళ్లి

కుటుంబంలో ఐదుగురుంటే ముగ్గురి పేర్లనే చేర్చారు

కుటుంబంలో ఐదుగురుంటే ముగ్గురి పేర్లనే చేర్చారు

ఇక ఎన్‌ఆర్‌సీ విడుదల చేసిన తుది జాబితా బూటకపు జాబితా అని దీన్ని తయారు చేసేందుకు అధికారులు సమయంతో పాటు వనరులను కూడా వృథా చేశారని గారియా మారియా సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే ముగ్గురి పేర్లను జాబితాలో ఉంచి ఇద్దరి పేర్లను తొలగించడం అన్యాయమని అన్నారు. ఒకే వారసత్వంకు సంబంధించిన సమాచారం తీసుకుని కొడుకును పక్కన ఎలా పెడుతారని ప్రశ్నించారు. అసలైన పౌరుల పట్ల కూడా ఇలా వ్యవహరించడం చాలా దారుణమని చెప్పారు. అందుకే హజేలాపై ఫిర్యాదు చేశామని దీంతో మళ్లీ ఎన్‌ఆర్‌సీపై సమీక్ష చేయడం జరుగుతుందన్న ఆశ తమకు ఉందని తెలిపారు.

ఎన్‌ఆర్‌సీపై వ్యతిరేకంగా గళమెత్తిన ముస్లిం సంస్థలు

ఎన్‌ఆర్‌సీపై వ్యతిరేకంగా గళమెత్తిన ముస్లిం సంస్థలు

పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ ఉపేన్ కలితా ఫిర్యాదును నిర్థారించారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశామని చెప్పారు. సెప్టెంబర్ 4వ తేదీన ఆలిండియా లీగల్ ఎయిడ్‌కు చెందిన చందర్ మజుందార్ కూడా హజేలాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దిబ్రుగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగానే జాబితా నుంచి తప్పించినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. తను పుట్టుకతోనే అస్సాం పౌరుడనని తన తల్లిదండ్రులు దిబ్రుగర్‌లో 1947లో సెటిల్ అయ్యారని చెప్పారు మజుందర్. 1951 ఎన్ఆర్‌సీ కూడా ఎఫ్ఐఆర్‌తో పాటు జత చేశారు. వీరితో పాటు ఇతర సంస్థలు కూడా ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా గళం ఎత్తాయి. ఇక ఎన్ఆర్‌సీ నుంచి దాదాపు 90శాతం మంది హిందువుల పేర్లను తొలగించడం జరిగింది.

 తుది జాబితాలో 50 లక్షల మందికి పైగా విదేశీయులు

తుది జాబితాలో 50 లక్షల మందికి పైగా విదేశీయులు

ఇదిలా ఉంటే ఎన్‌ఆర్‌సీ కోసం ప్రజలు సమర్పించిన డాక్యుమెంట్లను వెరిఫై చేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది బీజేపీ మిత్రపక్షం అస్సోం గన పరిషత్ పార్టీ.ఇక తుది జాబితాలో దాదాపు 50 లక్షల మంది విదేశీయుల పేర్లు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అస్సాంలో తయారు చేసిన ఎన్‌ఆర్‌సీ జాబితా చూస్తే అసలైన పౌరులను పక్కన పెట్టి అక్రమంగా అస్సాంలో నివాసముంటున్న విదేశీయులకు చోటు కల్పించడం సరికాదని అస్సోం గనపరిషత్ అధ్యక్షుడు వ్యవసాయశాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు. ముస్లిం కల్యాన్ పరిషత్ కూడా ఎన్‌ఆర్‌సీని పునఃపరిశీలించాలని డిమాండ్ చేింది. స్థానికులను అవమానపరిచేలా జాబితా ఉందని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ముస్లిం కల్యాన్ పరిషత్ అధ్యక్షుడు రహమ్సా అలీ చెప్పారు.

English summary
FIRs have been lodged in Guwahati and Dibrugarh against Prateek Hajela, the Coordinator for Assam’s National Register of Citizens (NRC) for deliberately excluding “genuine Indian” citizens from the updated citizens’ list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more