పూరీ ఎక్స్‌ప్రెస్ బోగీలో చెలరేగిన మంటలు

భువనేశ్వర్: దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన ఉదంతం- కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన తీర యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ఘటనలో 275 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 1,000కి పైగా గాయపడ్డారు. ఇప్పటికీ వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘోర దుర్ఘటనను విస్మరించకముందే ఒడిశాలోనే మరో రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. బుధవారం గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్సను అందిస్తోన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Durg Puri express

వరుసగా అదే ఒడిశాలో తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. సకాలంలో ప్రయాణికులు దీన్ని గుర్తించడంతో ఘోర ప్రమాదం తప్పినట్టయింది. దుర్గ్- పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగడాన్ని ప్రయాణికులు సకాలంలో గుర్తించగలిగారు. చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఏసీ కోచ్ నుంచి బయటికి వచ్చారు.

ఒడిశా నౌపడ జిల్లాలోని ఖరియార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. నంబర్ 18426 రైలు ఈ సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నుంచి ఒడిశాలోని పూరీకి బయలుదేరింది మార్గమధ్యలో రాత్రి 10: 07 నిమిషాల సమయంలో ఖరియార్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఏసీ బోగీలో నుంచి నల్లటి పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే బోగీ చక్రాల వద్ద మంటలు చెలరేగాయి.

Durg Puri Express

బీ3 కోచ్ నుంచి కిందిభాగం నుంచి మంటలు చెలరేగినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. చక్రాల వద్ద బ్రేక్స్ జామ్ కావడం వల్ల అవి రాపిడికి గురై మంటలు వచ్చాయని నిర్ధారించారు. అదే సమయంలో అలారం చైన్ పుల్లింగ్ పని చేయలేదని పేర్కొన్నారు. తొలుత పొగ వెలువడటం, ఆ వెంటనే మంటలు చెలరేగడాన్ని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. భయాందోళనలతో కిందికి దిగారు.

Durg Puri Express

సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులను సంఘటన స్థలానికి పిలిపించారు. బ్రేక్స్‌ను సరి చేశారు. రాత్రి 11:00 నిమిషాల సమయంలో ఈ ఎక్స్‌ప్రెస్ యధాతథంగా పూరీకి బయలుదేరి వెళ్లింది. మంటలను సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+