family: మంటలు వ్యాపించి ఒకే ఫ్యామిలీలో ఐదు మంది ?, గ్యాస్ గమనించని మహిళ !

లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా షాపూర్‌ గ్రామంలో ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ, ముగ్గురు మైనర్లతో సహా ఆ కుటుంబంలోని ఐదు మంది మృతి చెందారని అధికారులు అంటున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో వంట చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడే చనిపోయారని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మీడియాకు చెప్పారు.

Fire spread in the gas stove and five people died in the same family in Uttar Pradesh.

అగ్నిమాపక దళం, వైద్య బృందాలు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టవ్‌లో నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదికలో తేలిందని జిల్లా మేజిస్ట్రేట్ అరుణ్ కుమార్ చెప్పారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రకటించారు.

గ్యాస్ స్టౌవ్ లీకక్ కావడంతో మంటలు వ్యాపించడం వలనే ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో మహిళ గ్యాస్ లీక్ అయిన విషయం గమనించి ఉండదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు వ్యాపించి ఒకే ఇంటిలో ఐదు మంది అక్కడికక్కడే చనిపోడంతో ఆ గ్రామంలో విషయాద చాయలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+