IAF S-400 ఫస్ట్ ఇమేజ్ రివీల్.. శత్రు దేశాల గుండెలు హడల్..!

ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) మరింత బలోపేతం కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. S-400 రక్షణ వ్యవస్థకు సుదర్శన్ గా నామకరణం చేసింది. ఇది దేశ వైమానిక రక్షణ సామర్థ్యాలలో కీలకమైన ముందడుగుగా భావించవచ్చు. ఆకాశం గుండా భారత్ కు పొంచి ఉన్న ముప్పును ఈ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పి కొట్టనుంది. ఈ రక్షణ వ్యవస్థల్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఈ మేరకు 2018 లో ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలుకు భారత్- రష్యా మధ్య ఒప్పందం కుదిరింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ లు, క్షిపణులపై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఆవిష్కరించింది. ఈ S-400 వ్యవస్థ ఎలాంటి టార్గెట్ అయినా ఛేదించగలదు. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, అన్ మ్యానెడ్ ఏరియల్ వెహికల్స్(UAV), క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ను సమర్థవంతంగా నేలకూల్చే శక్తి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సొంతం.

ఈ అడ్వాన్స్ డ్ S-400 సుదర్శన్.. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో కొత్త శకం అని వెల్లడవుతోంది. ప్రస్తుతం పలు శత్రు దేశాలు అత్యాధునిక సాంకేతికతతో ఆకాశ మార్గంలో దాడికి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ వాటిని విజయవంతంగా నేలకూల్చే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది. 2018 లో రష్యా- భారత్ మధ్య కుదిరిన డిఫెన్స్ ఒప్పందంలో భాగంగా 5 బిలియన్ డాలర్ల విలువైన ఐదు రెజిమెంట్లను భారత్ కొనుగోలు చేసింది.

ఇక ఈ S-400 సుదర్శన్.. 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించి నేలకూల్చగలదు. 400 కిలోమీటర్ల పరిధిలో వాటిని ధ్వంసం చేయగలదు. ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయడమే కాకుండా 36 లక్ష్యాలతో కచ్చితత్వంతో పోరాడగలదు. అలాగే దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులోని UAVలు,క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైల్స్ ను పడగొట్టగలదు.

డిసెంబర్ 2025 నాటి శాటిలైట్ చిత్రాల ఆధారంగా.. అదంపూర్, భుజ్, జోధ్‌పూర్ IAF స్థావరాలలో S-400 రాడార్లు సమర్థవంతగా పనిచేస్తున్నాయి. 2025 చివరి నాటికి మూడు రెజిమెంట్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ జాప్యం ఉన్నప్పటికీ.. మిగిలిన రెండు రెజిమెంట్లు నవంబర్ 2026 నాటికి సిద్ధమవుతాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు IAF చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీసింగ్ S-400 వ్యవస్థను గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు.

First Ever Image of IAF s S-400 Sudarshan Revealed India s Air Defense Gets Unstoppable Boost

ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ S-400 వ్యవస్థ పాకిస్థానీ డ్రోన్‌లు, క్షిపణులను భారత భూభాగంలోకి రాకుండా అడ్డుకుంది. పాక్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్స్ ను కూల్చివేసింది. ఐఏఎఫ్ కార్యాలయాల్ని శత్రు దేశం దాడి నుంచి రక్షించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+