వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

OMICRON : ఢిల్లీలో తొలి ఓమిక్రాన్ కేసు గుర్తింపు - అయిదుకు చేరిన మొత్తం కేసులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఓమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో క్రమేణా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు కేసులను అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా, ఢిల్లీలో ఓమిక్రాన్ కేసు బయటకు వచ్చింది. టాంజానియా దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో ఓమిక్రాన్ వైరస్ ను గుర్తించారు. దీంతో..దేశంలో కేసుల సంఖ్య అయిదుకు పెరిగింది. టాంజానియా నుంచి వచ్చిన వెంటనే పరీక్షలు చేయగా..పాజిటివ్ రావటంతో ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు పాజిటివ్ గా గుర్తించిన 17 మందిని ఈ ఆస్పత్రిలో చేర్చినట్లుగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.

Recommended Video

Omicron Variant Already In Major Cities Of India, Wake Up Call | Oneindia Telugu
దేశంలో అయిదో కేసుగా గుర్తింపు

దేశంలో అయిదో కేసుగా గుర్తింపు

ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదవ్వగా, శనివారం మరో రెండు కేసులు రికార్డయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒకటి, ముంబైలో మరో కొత్త వేరియంట్‌ కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. జింబాబ్వే నుంచి ఈ నెల 2న వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, జన్యుక్రమ విశ్లేషణ కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిందని గుజరాత్‌ హెల్త్‌ కమిషనర్‌ జయ్‌ ప్రకాశ్‌ శివహరే తెలిపారు.

టాంజానియా నుంచి వచ్చిన ప్రయాణీకుడు

టాంజానియా నుంచి వచ్చిన ప్రయాణీకుడు

దక్షిణాఫ్రికా నుంచి గత నెల 23న ఢిల్లీకి, ఆ తర్వాత ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, నమూనాలను విశ్లేషించగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయిందని ముంబై అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలోని పలు జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు, వీక్లీ డెత్స్‌, వైరస్‌ వ్యాప్తిలో పెరుగుదల నమోదవుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, జమ్ముకశ్మీర్‌, ఒడిశా, మిజోరానికి శనివారం లేఖలు రాసింది.

కేంద్రం కీలక సూచనలు..

కేంద్రం కీలక సూచనలు..

పరీక్షలు-నిఘా-చికిత్స-వ్యాక్సిన్‌-కొవిడ్‌ నిబంధనలు' సరిగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బూస్టర్‌ డోసు ఇవ్వడంపై మరింత శాస్త్రీయ అధ్యయనం చేయాల్సి ఉన్నదని ఇన్సాకాగ్‌ పేర్కొంది. కాగా, వరుసగా బయటకు వస్తున్న కేసులతో కేంద్రం అప్రమత్తమైంది. విమానాశ్రయాల వద్ద ఆంక్షలను మిరంత తీవ్రతరం చేసింది.

విదేశాల నుంచి వచ్చిన వారికి ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపిస్తున్నారు. అదే సమయంలో కేసులు బయట పడ్డ రాష్టాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

English summary
Delhi reported its first case of new Covid-19 Variant Omicron on Sunday. This is the fifth case of Omicron reported in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X