ఈవీఎం- వీవీప్యాట్ల రాండమైజేషన్ పై ఈసీ తాజా వ్యూహం
నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన కేరళ, అదే నెల 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఒకేదశలో ఇవి ముగుస్తాయి. మే 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎం- వీవీప్యాట్ల రాండమైజేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అస్సాం, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఈవీఎం-వీవీప్యాట్ల మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ ద్వారా రూపొందిన జాబితాలను సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించినట్లు ఈసీఐ పేర్కొంది.

వీటితో పాటు ఏప్రిల్ 9న పోలింగ్‌కు వెళ్లే గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని ఉపఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల మొదటి రాండమైజేషన్ కూడా పూర్తయినట్లు తెలిపింది. ఈవీఎంలను వాటి పోలింగ్ స్టేషన్లకు కేటాయించడానికి రెండు దశల రాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తారు. మొదటి దశలో- జిల్లా స్థాయి గోడౌన్ల నుండి ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం రెండవ దశలో నియోజకవర్గాల నుండి అవి పోలింగ్ స్టేషన్లకు అలొకేట్ అవుతాయి.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా ఎన్నికల అధికారులు ఫస్ట్ లెవెల్ చెకింగ్ లో ఈవీఎం-వీవీప్యాట్ల మొదటి రాండమైజేషన్‌ను తప్పనిసరిగా పూర్తిచేయాల్సి ఉంటుంది. దీన్ని అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో పూర్తి చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే వ్యవస్థ ద్వారా డీఈఓలు ఈ ప్రక్రియను నిర్వహించారు.
రాండమైజ్ చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్ల నియోజకవర్గాల వారీ జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారి జిల్లా ప్రధాన కార్యాలయాల్లో అందజేశారు. వీటన్నింటినీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే సంబంధిత అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ఖరారు అయిన తర్వాత, ఈ జాబితాలు పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ కూడా అందజేస్తారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications