వనపర్తిలో రోడ్ టెర్రర్: స్కార్పియో బోల్తా.. ఐదుగురు అక్కడిక్కడే మృతి..
తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో.. అదుపు తప్పి డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టడంతో.. స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
వనపర్తి : వనపర్తి జిల్లా కొత్తకోటను ఆనుకుని ఉన్న 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో.. అదుపు తప్పి డివైడర్‌ను వేగంగా ఢీ కొట్టడంతో.. స్కార్పియోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.

అమడబాకుల గ్రామానికి సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను జనార్థన్, నాగరాజు, వెంకటేశ్, పవన్ కుమార్, శేఖర్ గా గుర్తించారు. చనిపోయిన వారంతా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ, రాచాల గ్రామాలకు చెందిన వ్యక్తులని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదిరిగా పడిపోయాయి. దీంతో స్థానికులంతా ఈ దుర్ఘటనను చూసి చలించిపోయారు.












Click it and Unblock the Notifications