వాటర్ ట్యాంక్ కూలిన ప్రమాదం మృతుల్లో ఇద్దరు టీవాళ్లు

బెంగళూరు: కర్ణాటకలోని యాపలదిన్నెలోని ఉర్సు ఉత్సవాల్లో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక రోజు ముందే నిర్మించిన నీటి ట్యాంక్ కూలడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వాసులు కాగా, మరో ముగ్గురు రాయచూర్‌కు చెందినవారు.

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మండలంలోని గట్టుకు చెందిన హుస్సేనప్ప, జమ్మిచేడుకు చెందిన షాజహాన్ మృతి చెందినవారిలో ఉన్నారు. ఉర్సు ఉత్సవాల్లో దుకాణం నడిపేందుకు వీరిద్దరు అక్కడికి వచ్చారు. మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం లక్ష రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించింది. మృతేదేహాలు రాయచూర్ ఆస్పత్రిలో ఉన్నాయి.

Five killed as surface water tank collapses in Raichur

ఉర్సు ఉత్సవాలకు యాపలదిన్నెలో దాదాపు పదివేల మంది వచ్చారు. గ్రామంలోని హజరాజ్ జంగిల్ పీర్‌షాబ్ దర్గాలో వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో బాధితులు వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో 10 నుంచి 20 అడుగుల వరకు ఉండే నాలుగు గోడల్లో మూడు గోడలు కూలాయి.

గాయపడిన మరో ఇద్దరిని రాయచూర్ వైద్య విజ్ఝాన సంస్థకు తరలించారు. రూ.2.29 లక్షల వ్యయంతో ట్యాంక్‌ను గ్రామపంచాయతీ నిర్మించింది. వాటర్ ట్యాంక్ కూలడంతో యాత్రికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తీవ్ర నిరసనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+