వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా

గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. జనవరి 9న ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ విమానంలో వెళ్లాల్సిన 50 మంది ప్రయాణికులను వదిలేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల ప్రయాణికులను వదిలేసి విమానం వెళ్లిపోవడం గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. బెంగళూరు విమానాశ్రయంలో సుమారు 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి గోఫస్ట్ విమానం ఢిల్లీకి వెళ్లిపోయింది. జనవరి మొదటి వారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. జనవరి 9న ఢిల్లీకి వెళ్లే గో ఫస్ట్ విమానం బెంగుళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఆ విమానంలో వెళ్లాల్సిన 50 మంది ప్రయాణికులను వదిలేసింది. దీంతో వారంతా షటిల్ బస్సులో బోర్డింగ్ కోసం వేచివుండాల్సి వచ్చింది.

 Flight Left Behind 55 Passengers In Bus: Go First Fined Rs 10 Lakh By DGCA

ఈ క్రమంలో ప్రయాణికులు సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి పోస్టు చేశారు. గోఫస్ట్ ఎయిర్ లైన్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు. సంబంధిత అధికారులను ట్యాగ్ చేశారు. తమను ఢిల్లీకి వెళ్లే విమానంలోకి అనుమతించలేదని పేర్కొన్నారు. G8 116 నంబర్ గల విమానం 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి జనవరి 9 ఉదయం 6:40 గంటలకు బయలుదేరింది.

ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు గో ఫస్ట్ నిరాకరించింది. అయితే, ఒక ట్వీట్‌కు ప్రతిస్పందనగా.. ఎయిర్‌లైన్ వినియోగదారులను వారి వివరాలను పంచుకోమని కోరింది. వారు కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు.

అంతకుముందు, ఈ సంఘటనతో ఎయిర్‌లైన్ ఆపరేటర్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. గో ఫస్ట్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించారని మండిపడింది. చాలా విషయాల్లో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొంది.

English summary
Flight Left Behind 55 Passengers In Bus: Go First Fined Rs 10 Lakh By DGCA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X