ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ వాల్యూ వీక్.. ఆఫర్లే ఆఫర్లు!
బెంగళూరు: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సూపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. వినియోగదారులు కొనుగోలు చేసే మొబైల్ ఫోన్లకు 'బెస్ట్ వాల్యూ' ఇచ్చే ఉద్దేశంతో 'సూపర్ వాల్యూ వీక్ ఆఫర్'ను ప్రకటించింది. ఈనెల 24 వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
ప్రమోషనల్‌లో భాగంగా కేవలం రూ.49కే బై బ్యాక్ గ్యారెంటీ అందిస్తోంది. అలాగే బజాజ్ ఫిన్ సెర్వ్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు నో-కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. వీటితోపాటు పాపులర్ బ్రాండ్ల మొబైల్స్, టీవీలు, హోం అప్లయెన్సెస్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందిస్తోంది.

'సూపర్ వాల్యూ వీక్'లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ 50 శాతం బైబ్యాక్ గ్యారెంటీ అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 2ఎక్స్ఎల్, వివో వీ7ప్లస్, ఎంఐ మిక్స్ 2ఎస్, మోటో ఎక్స్4 64 జీబీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్8 తదితర వాటిపై 50 శాతం బైబ్యాక్ అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ బైబ్యాక్ ధరను రూ.50వేలుగా పేర్కొంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్‌కు రూ.24,500 బైబ్యాక్ అందిస్తుండగా, గూగుల్ పిక్సెల్2కు రూ.22 వేలు అందిస్తున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు మోటో ఎక్స్4, రెడ్‌మీ నోట్ 5ప్రో, వివో వీ7, ఐఫోన్ 8, ఒప్పో ఎఫ్5, లెనోవో కే8 ప్లస్, ఐఫోన్ 7, ఆనర్ 9లైట్, రెడ్‌మీ నోట్ 5 తదితర ఫోన్లపైనా బై బ్యాక్ అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ వివరించింది.
ఈ బైబ్యాక్ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే కొత్త స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే పాత ఫోన్ తీసుకోవడానికి కొంతమొత్తంలో నామమాత్రపు ఫీజు వసూలు చేస్తామని తెలిపింది.
బైబ్యాక్ ఆఫర్‌తోపాటు వివిధ రకాల ఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, తక్షణ రాయితీలు ఇస్తోంది. కార్బన్ టైటానియం జంబో, మైక్రోమ్యాక్స్ స్పార్క్ 4జీ, మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5 లైట్ క్యూ462, జోలో ఎరా 1ఎక్స్, ఐవూమీ మి3 తదితర వాటిపై ఎక్స్‌చేంజ్ అందిస్తున్నట్టు తెలిపింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications