నీట మునిగిన కార్లు.. రహదారులపైకి వరదనీరు.. బెంగళూరు పరిస్థితి ఇదీ..
వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఐటీ హబ్ బెంగళూరు వరదనీటితో పోటెత్తింది. వరదనీటితో కార్లు నీట మునిగాయి. ఇక రహదారుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కొన్ని భవనాల్లో నీటితో నిండిపోయింది. బెంగళూరు శివారు ప్రాంతంలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. సిటీలో కూడా ఎక్కువగానే ఉంది. మోకాళ్ల లోతు వరకు నీరు చేరి ఉంది. యెల్లంకలో నదీ నిండి పోయి.. 27 ఎకరాల వరకు నీరు బయటకు వచ్చింది. దీంతో ఆ సమీపంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.
కొగిల్లు క్రాస్, నాగవర, విద్యారణ్యపుర, యెల్లంకలో ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీంతో జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. ఎస్డీఆర్ఎఫ్‌తో సమన్వయం చేసుకొని సహాయ చర్యలను చేపడుతుంది. వర్షంతో ఇళ్లు కోల్పోయిన వారికి రూ.1లక్ష అందజేస్తామని సీఎం బసవరాజు బొమ్మై ప్రకటించారు. రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల కోసం రూ.500 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

Recommended Video
సింగపుర లేక్, అమనిఖేరే లేక్, అల్లసంద్ర లేఖ్ కూడా నిండిపోయాయి. దీంతో ఆ సమీప ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తీవ్ర ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా కురుస్తోన్న చిగురుటాకులా వణికిపోయాయి. గ్రామాలే కాదు పట్టణాలు, నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.












Click it and Unblock the Notifications