నిరాడంబరంగా నిర్మలా సీతారామన్ కూతురి పెళ్లి
బెంగళూరు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాజ్ఞయి పెళ్లి పీటలు ఎక్కారు. బెంగళూరులోని నివాసంలో అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుకలు జరిగాయి. తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వివాహం సాగింది. ప్రతీక్‌ను ఆమె పెళ్లాడారు. ఈ వివాహానికి ఆహ్వానితులు అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
పరకాల ప్రభాకర్- నిర్మలా సీతారామన్ కుమార్తె వాజ్ఞయి. వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న ఓ జాతీయ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తోన్నారు. ప్రత్యేకించి- ఆర్ట్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, సాహిత్యం మీద వార్తలను రాస్తుంటారు. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ఆమె. ఈ ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ, ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఎంఏ చేశారు.

అమెరికా బోస్టన్, మసాచ్చుసెట్స్‌లో గల నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో జర్నలిజంలో ఎంఎస్ చేశారు. వాజ్ఞయి ఫొటో జర్నలిజంలో నిష్ణాతురాలు. విద్యాభ్యాసాన్ని ముగించుకున్న తరువాత ది లైవ్ మింట్, ది వాయిస్ ఆఫ్ ఫ్యాషన్, ది హిందూ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. ఇవ్వాళ ప్రతీక్‌ను పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులోని నివాసంలో సాదాసీదాగా ఈ వివాహం జరిగింది.
నూతన వధూవరుల తరఫున వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. కేంద్ర మంత్రి అయినప్పటికీ- రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకూ పెళ్లి పిలుపు లేదు. ఉడుపి మఠాధిపతి ఈ వివాహానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. తమిళ బ్రాహ్మణ సంప్రదాయపద్ధతుల్లో వివాహ ప్రక్రియ కొనసాగింది.

ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఆమె మంత్రి వర్గ సహచరులు రిసెప్షన్‌కు హాజరవుతారని తెలుస్తోంది. రాజకీయ నాయకులెవరికీ ఈ పెళ్లికి ఆహ్వానాలు పంపలేదు. రాజ్యసభ సభ్యురాలైన నిర్మల సీతారామన్.. కర్ణాటకకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. కర్ణాటక నుంచి ఆమె పెద్దల సభకు నామినేట్ అయ్యారు.












Click it and Unblock the Notifications