దుర్గామాతపై అసభ్యకర పాట.. దసరా వేడుకల వేళ ఘోర అవమానం..!!!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మిర్జాపూర్‌కు చెందిన జానపద గాయని సరోజ్ సర్గమ్ హిందూ దేవతలను అవమానించేలా పాటలు పాడడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
దేవతలను అవమానించే లిరిక్స్..
సరోజ్ సర్గమ్ పాడిన పాటలో విష్ణుమూర్తిని హంతకుడిగా, దుర్గమ్మను వేశ్యగా, ప్రహ్లాదుడిని మద్యం తాగేవాడిగా అభివర్ణించారు. ఈ పాట సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆగ్రహావేశానికి గురై, పోలీసులకు ఫిర్యాదులు చేసాయి. వెంటనే ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్ రాయ్ ఫిర్యాదు మేరకు మదిహాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరోజ్ సర్గమ్‌తో పాటు ఆమె భర్త రామిలన్ బింద్ సహా బిర్హా బృందంలోని ఆరుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రామిలన్ బిందే ఆ పాటను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
గతంలోనూ అనేక కేసులు
అయితే పోలీసుల ప్రకారం, ఈ బిర్హా బృందంపై గతంలోనూ వివిధ కేసులు నమోదయ్యాయి. మార్చి 23, 2025న నగర కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో గాయని, ఆమె భర్తపై మరో కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పటివరకు మిర్జాపూర్, మధ్యప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో కలిపి ఎనిమిది కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ బిర్హా బృందాన్ని సరోజ్ భర్త రామిలన్ బింద్ నడుపుతున్నట్టు గుర్తించారు. సరోజ్ సర్గమ్ గత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలుగా PDA (వెనుకబడిన, దళిత, మైనారిటీ) కమ్యూనిటీలకు అనుకూలంగా పాటలు పాడుతూ తరచూ వివాదాలకు కారణమవుతున్నట్లు తెలిపారు.
రచయితపై ఆరోపణలు..
మరోవైపు వివాదాస్పదమైన పాటను తాను స్వయంగా రాయలేదని, రచయిత రాజ్‌వీర్ సింగ్ యాదవ్ ఆదేశాల మేరకే తాను పాడినట్లు సరోజ్ సర్గమ్ పోలీసులకు చెప్పింది. రాజ్‌వీర్ సింగ్ తన "బహుజన్ నాయక్ మహిషాసుర్" అనే పుస్తకంలో ఈ అంశాలు ఇప్పటికే రాసారని, దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు గెలిచానని ఆమెకు నమ్మకం కలిగించాడని తెలిపింది. ఈ మేరకు పోలీసులు ఇప్పుడు రాజ్‌వీర్ సింగ్ యాదవ్‌ను ప్రధాన సూత్రధారిగా పరిగణించి గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా ఎవరినీ విడిచిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications