ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం.. ఆ సేవలు నిలిపివేత!

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తామంటూ 2022లో జొమాటో 'జొమాటో ఇన్ స్టంట్ 2022' ను ప్రకటించింది. అయితే జొమాటో బెంగళూరు, గురుగ్రామ్ మరియు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈ సేవలను పరిశీలించిన తర్వాత జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది.

జొమాటో తక్షణ డెలివరీ సేవలో భాగంగా గతేడాది ప్రారంభించిన ఇన్స్టంట్ 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవను రద్దు చేయటానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈ సేవలను జొమాటో నిలిపివేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మేరకు రెస్టారెంట్ భాగస్వాములకు కూడా జొమాటో ఇటీవల సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జొమాటో ఇన్ స్టంట్ 2022 సేవలను రద్దు చేసిన తర్వాత ఈ సేవల స్థానంలో తక్కువ విలువ కలిగిన ప్యాక్డ్ మీల్స్, థాలీ, కాంబో మీల్స్ వంటి వాటిని సరఫరా చేయడానికి సంస్థ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Food delivery app Zomato taken key decision to stop the zomato instant services !!

కఠినమైన మార్కెట్ పరిస్థితులను తట్టుకొని లాభాలను పెంపొందించుకోవడం కోసం జొమాటో పది నిమిషాల్లో ఆరపదార్థాలను చేరవేసే జొమాటో ఇన్స్టెంట్ 2022ను తీసుకువచ్చింది. అయితే ఈ సేవలతో లాభాలు పెరగకపోగా, అవుతున్న ఖర్చులకు తగ్గట్టుగా ఆర్డర్లు కూడా రావడం లేదని జొమాటో గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ సేవలను నిలిపివేసి ఆ స్థానంలో మరో కొత్త సేవను వారం పది రోజుల్లో ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. అయితే ఇన్స్టంట్ సేవలను నిలిపివేయడం లేదని, రీబ్రాండింగ్ చేస్తున్నామని మాత్రం జొమాటో చెబుతోంది. ఇక తాజా నిర్ణయం వల్ల వినియోగదారులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదని జొమాటో సంస్థ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+