వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని ఈసీని కోరిన కేజ్రీవాల్

త్వరలో జరిగే ఢిల్లీ మున్సిఫల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయాన్ని నమోదు చేయడంపై బిఎస్ పి అధినేత్రి మాయావతి అనుమానాన్ని వ్యక్తం చేశారు.అయితే త్వరలో జరిగే ఢిల్లీ మున్సిఫల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే బిఎస్ పి చీఫ్ మాయావతి ఈవీఎంల పనితీరుపై అనుమానాన్ని వ్యక్తం చేశారు.అయితే ఢిల్లీ మున్సిఫల్ ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

For MCD election in Delhi, use ballot paper, not EVMs

ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో త్వరలో జరిగే ఢిల్లీ మున్సిఫల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెల్ పేపర్లను ఉపయోగించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఈవీఎంలను బిజెపికి ఓట్లు పడేలా ట్యాంపరింగ్ చేశారని బిఎస్ పి అధినేత్రి మాయావతి ఆరోపించారు.దీంతో ఢిల్లీమున్సిఫల్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.

English summary
Kejriwal has written to Chief Secretary asking to direct the state Election Commission to use paper ballots instead of the EVMs in the upcoming MCD election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X