అడ్డదారిలో సీఎంగా శశికళ: వదిలిపెట్టను, జయ మేనకోడలు దీపా !
అడ్డదారిలో శశికళ సీఎం పీఠం దక్కించుకుంటున్నారని, ఆమె నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారని, జయలలిత ఎంతో నమ్మిన శశికళ ఇప్పుడు పార్టీకి, తమిళ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని.
చెన్నై: అడ్డదారిలో శశికళ సీఎం పీఠం దక్కించుకుంటున్నారని, ఆమె నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. చెన్నైలోని టీ. నగర్ లోని ఇంటి దగ్గర దీపా పేరవై సంస్థ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
అమ్మ జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దీపా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం తనపని తాను చేసుకుని వెలుతున్న సమయంలో అధికార దాహం కోసం శశికళ ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారని దీపా ఆరోపించారు.

అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో కుర్చున్న ఎమ్మెల్యేలు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా శశికళను సీఎం చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. దీపా పేరవై అభిమాన సంఘం పేరుతో సమాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె గుర్తు చేశారు.
అయితే శశికళ పోలీసులను రెచ్చగొట్టి దీపా పేరవై సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా కార్యకర్తలను వేదిస్తున్నారని దీపా ఆరోపించారు. జయలలిత ఎంతో నమ్మిన శశికళ ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకి, తమిళనాడు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. శశికళను సామాన్యంగా వదిలిపెట్టనని, రాజకీయంగానే ఎదుర్కొంటానని దీపా జయకుమార్ చాలెంజ్ చేశారు.
తనను నమ్ముకుని ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు చెప్పినట్లు తాను నడుచుకుంటానని, మీరు చెప్పినట్లు జయలలిత పేరు నిలబెట్టడానికి ఎంతవరకైనా పోరాటం చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని దీపా పేరవై సంస్థ నాయకులు, కార్యకర్తలకు దీపా జయకుమార్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications