• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రియా సంచలన విషయాలు: సుశాంత్‌ గంజాయి తీసుకునేవాడా..? ఫారిన్‌లో ఏం జరిగింది..?

|

ముంబై: బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తీసుకుంటోంది. ఇప్పటి వరకు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి తొలిసారిగా నోరు విప్పింది. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి తొలిసారిగా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను బయటపెట్టింది. ఇప్పటికే రియా చక్రవర్తి పై సీబీఐ, ఈడీ, మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలు నిఘా పెట్టాయి. ఆమెను విచారణ చేస్తున్నాయి. ఆమెపై వస్తున్న ఆరోపణలన్నిటికీ వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు కూడా పెద్ద కుట్రే అని ఆమె కొట్టి పారేశారు.

నా కలలోకి సుశాంత్ వచ్చాడు

నా కలలోకి సుశాంత్ వచ్చాడు

ఇంతకాలంగా నోరు విప్పని రియా చక్రవర్తి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అడుగగా తన కలలో సుశాంత్ వచ్చి ఉన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని తనతో చెప్పినట్లు రియా చెప్పుకొచ్చింది. ముందుగా తమ బంధం ఎక్కడ ప్రారంభమైందో చెప్పిన రియా... తొలిసారిగా 2013లో యష్‌రాజ్ ఫిలిమ్స్ జిమ్‌లో సుశాంత్ సింగ్‌ను కలిసినట్లు చెప్పింది. అప్పటికే తన తొలిసినిమా విడుదలైందని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ 2015లో రోహిణీ అయ్యర్ పార్టీలో కలిశాడని ఒక్కరోజులోనే తనతో ప్రేమలో పడ్డట్టు సుశాంత్ తనతో చెప్పగా ఇందుకు కొంత సమయం కావాల్సిందిగా తాను కోరినట్లు వెల్లడించింది. ప్రేమ అనేది ఇంతటి దారుణానికి దారితీస్తుందని తాను ఊహించలేదని వెల్లడించింది. ఆ సమయంలో తనకు ఒక చిన్న సుశాంత్ కావాలని చెప్పేవాడని దీని బట్టి తమ మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రియా చెప్పుకొచ్చింది.

 జూన్ 8 న ఏం జరిగింది..?

జూన్ 8 న ఏం జరిగింది..?

జూన్ 2-3వ తేదీల మధ్య ఇళ్లు వదిలి వెళ్లాల్సిందిగా సుశాంత్ బలవంతం చేశాడని అయితే తాను మాత్రం వెళ్లలేదని చెప్పారు. అప్పటికే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనేదాన్నని చెప్పిన రియా... జూన్ 8వ తేదీన థెరపీ సెషన్ ఉండగా అంతకంటే ముందే ఇంటిని వదిలి వెళ్లాలని చెప్పినట్లు రియా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తన సోదరి గుడ్గావ్‌ నుంచి వస్తుందని చెప్పగా... ఆమె వచ్చాకే వెళతానని సుశాంత్‌తో చెప్పినట్లు రియా వివరించింది. ఇక అయితే ఆమె రాకముందే తనను వదిలి వెళ్లాలని మరీ బలవంతం చేశాడని రియా చెప్పుకొచ్చింది. సోదరి మీతు వచ్చాక వెళితేనే బాగుంటుందని తాను భావించినట్లు చెప్పుకొచ్చింది.

మహేష్‌భట్‌‌తో చాటింగ్ అంశంపై...

మహేష్‌భట్‌‌తో చాటింగ్ అంశంపై...

మహేష్‌భట్ తనకు తండ్రితో సమానమని.. తనను ఆయన కూతురులా చూసుకునేవారని చెప్పిన రియా... లోకం మరో సంబంధం అంటగట్టడంపై ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేసింది. వాట్సాప్ చాటింగ్‌లోనే ఆయన తన బిడ్డగా సంబోధించారని గుర్తుచేసింది. ఇక సుశాంత్ తనను ఇంటి నుంచి బలవంతంగా పంపించేస్తున్నాడన్న విషయాన్ని భట్‌తో చెప్పగా అవన్నీ మర్చి పోయి ముందుగా తన తండ్రి గురించి ఆలోచించాలని భట్ సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అంతకుముందు సుశాంత్ సింగ్ తాను ఇళ్లు వదిలి వెళ్లే వరకు బలవంతం చేశాడని దీనిపై నిరాశ చెందినట్లు చెప్పింది.

విదేశాల్లో ఏం జరిగింది..?

విదేశాల్లో ఏం జరిగింది..?

సుశాంత్‌తో కలిసి విదేశాలకు ట్రిప్‌కు వెళ్లినట్లు చెప్పిన రియా.. పారిస్ వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అంతకుముందు అంటే విమానంలో ఉన్నప్పుడే మానసికంగా ఏదో భయానికి గురైనట్లు గమనించినట్లు చెప్పింది. ఇందుకోసం ఓ టాబ్లెట్‌ కూడా సుశాంత్ తీసుకున్నాడని.. ఆ మాత్రలు ఎప్పుడూ తన వెంట ఉంటాయని తెలిపింది. ఆ మెడిసిన్ పేరు మోడాఫినిల్ అని చెప్పింది. ఇక పారిస్‌లో హోటల్ గది నుంచి మూడురోజుల పాటు బయటకు రాలేదని వెల్లడించింది. ట్రిప్‌కు ముందు తన నిజస్వరూపాన్ని అంటే తాను ఎలా ఉంటాడో చూపించాలని తపించిపోయాడని గుర్తు చేసింది రియా. భారత్‌లో బయట ఉంటే సెలబ్రిటీ స్టేటస్ అడ్డువస్తుంది కాబట్టి విదేశాల్లో అయితే తాను తనలా ఉండొచ్చని భావించాడని రియా చెప్పుకొచ్చింది. ప్యారిస్ నుంచి స్విట్జర్లాండ్, ఆ తర్వాత ఇటలీకి వెళ్లినట్లు చెప్పింది. అక్కడ తీసుకున్న హోటల్‌ చాలా భయంకరంగా ఉందని గుర్తు చేసింది రియా.

తండ్రితో సుశాంత్ సంబంధం

తండ్రితో సుశాంత్ సంబంధం

ఇక కుటుంబ విషయానికొస్తే సుశాంత్ సింగ్‌కు తన తండ్రితో మంచి సంబంధాలు ఉండేవి కాదని తెలిపింది. తాను పరిచయం కాకముందే అంతకు ఐదేళ్ల ముందునుంచే తన తండ్రితో మాట్లడటం లేదని తెలుసుకున్నట్లు రియా వివరించింది . ఇక మానసికంగా తాను సరిగ్గా లేనని పలుమార్లు సుశాంత్ చెప్పినట్లు రియా వెల్లడించింది. 2013లో సైకియాట్రిస్టును కలిసి ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లుగా కూడా తనతో చెప్పినట్లు వెల్లడించింది. తన తల్లి లేకుండా సుశాంత్ బతకలేడు కాబట్టి మానసికంగా కాస్త డిస్ట్రబ్ అయినట్లు తనకు అర్థమైందని రియా వెల్లడించింది . దీనికోసం హిందూజా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నాడని ఇక డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ మాత్రమే తీసుకున్నాడు తప్ప అందులో డ్రగ్స్ లేవని రియా వివరించింది.

  Sushant Singh Rajput : Sushant కనపడక దయనీయ స్థితిలో పెంపుడు కుక్కలు..!
  సారీ బాబు అని ఎందుకు అనింది..?

  సారీ బాబు అని ఎందుకు అనింది..?

  సుషాంత్ తానెప్పుడు తనలా ఉండాలనే మనస్తత్వం ఉన్నవాడని చెప్పిన రియా... తాను గంజాయి సేవించేవాడని పేర్కొంది. తాను పరిచయం అవ్వకముందు నుంచే తాను గంజాయి తీసుకునేవాడని వెల్లడించింది. అయితే తాను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వినేవాడు కాదని, తాను తనలా ఉండేందుకే ఇష్టపడతాడని రియా చెప్పింది. మెడిసిన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటాడని... స్మోక్ చేయాలంటే చేస్తాడని చెప్పింది. ఇక సుశాంత్ తీసుకున్న కాఫీలో తాను డ్రగ్స్ కలిపినట్లు వస్తున్న వార్తలను రియా ఖండించారు. ఇక చనిపోయినప్పుడు మృతదేహం వద్ద ఐయామ్ సారీ బాబూ అని ఎందుకు చెప్పిందో వివరణ ఇచ్చింది రియా. చనిపోయిన వ్యక్తిని చూసి ఒక భారతీయుడు ఏమని చెబుతారని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ నువ్వు పిరికివాడివని అంటున్నారని అందుకు సారీ చెప్పినట్లు రియా చెప్పింది. తన మృతిపై పలురకాలుగా మాట్లాడుతున్న లోకం తరపున సారీ చెప్పినట్లు వెల్లడించింది. క్షణికావేశంలో సుశాంత్ తీసుకున్న నిర్ణయానికి సారీ చెప్పినట్లు రియా చెప్పింది.

  ఏదీ ఏమైనప్పటికీ న్యాయం జరిగేవరకు తాను పోరాడుతానని రియా చెప్పుకొచ్చింది. సుశాంత్‌ను తాను ఎంతగా ప్రేమించిందో అది తనకు మాత్రమే తెలుసని చెప్పిన రియా ... తన చుట్టే సుశాంత్ ఉంటాడనే విశ్వాసం వ్యక్తం చేసింది. సుశాంత్ మరణానికి దారి తీసిన కారణాలు నిజనిజాలు తనకు తెలియాలని చెప్పుకొచ్చింది.

  English summary
  Rhea Chakraborthy finally came out to speak on Sushanth singh death row. Speaking to a national news Channel, she opened herself to say that the truth will come out soon
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X