గాంధీ కుటుంబం కొత్త శకం-ఒకేసారి ఎంపీలుగా ముగ్గురు..! లోక్ సభలో రచ్చే..

గాంధీ కుటుంబంలో అరుదుగా కనిపించే దృశ్యం. అదీ దేశ అత్యున్నత సభ పార్లమెంట్ లో. ఒకే సారి గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఎంపీలుగా ఉన్నారు. గతంలో అత్యధికంగా గాంధీ కుటుంబం నుంచి ఇద్దరు మాత్రమే ఎంపీలుగా పనిచేసిన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రూపంలో ముగ్గురు ఎంపీలుగా ఉన్నార. సోనియా రాజ్యసభ ఎంపీగా, రాహుల్, ప్రియాంక లోక్ సభ ఎంపీలుగా ఉన్నారు.

తాజాగా అన్న రాహుల్ గాంధీ వదులుకున్న వాయనాడ్ లోక్ సభ సీటులో జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసిన ప్రియాంక గాంధీ అన్నను మించి నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. తద్వారా ఎన్నికల్లో ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు వారసత్వ రాజకీయాల పేరుతో ప్రత్యర్దులు విమర్శలు చేస్తారనే భయంతో ఎన్నికలకు దూరంగా ఉండిపోయిన ప్రియాంక గాంధీకి ఎంట్రీలో ఓటర్లు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దీంతో ఇవాళ ప్రియాంక పార్లమెంట్ లో ఘనంగా ఎంట్రీ ఇచ్చారు.

for the first time three gandhis Sonia Rahul and priyanka in parliament

తల్లి సోనియాగాంధీ, అన్న రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్ కు వచ్చిన ప్రియాంక గాంధీ వాద్రా.. అన్న తరహాలోనే రాజ్యాంగ ప్రతిని చేత్తో పట్టుకుని ఎంపీగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత స్పీకర్ తో పాటు అన్నకూ నమస్కరించి ఎంపీగా సంతకం చేశారు.
అనంతరం తల్లి, అన్నతో కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఇంతటితో ఆయిపోలేదు. ఇప్పటికే పార్లమెంట్ ప్రతీ సమావేశంలోనూ రాహుల్ గాంధీ లోక్ సభలో విపక్ష నేత హోదాలో దుమ్మురేపుతున్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు ఇప్పుడు ప్రసంగాల్లో దిట్ట అయిన ప్రియాంక కూడా ఆయనకు తోడైతే లోక్ సభలో కాంగ్రెస్ వాణి మరింత బలంగా వినిపించబోతోంది. ఇదో రకంగా బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఇబ్బంది కలిగించే అంశమే.

for the first time three gandhis Sonia Rahul and priyanka in parliament

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+