ఈషా అంబానీకి ఫోర్బ్స్ అవార్డు; ముఖేష్ అంబానీ తనయ తక్కువేం కాదు!!
ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె, ఆకాష్ అంబానీ సోదరి, ఈషా అంబానీ ప్రతిష్టాత్మక జెన్‌నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారం తన ఖాతాలో వేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ యూనిట్ చైర్ పర్సన్ ఈషా అంబానీ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2023 కార్యక్రమంలో జెన్‌నెక్ట్స్ ఎంట్రప్రెన్యూర్ పురస్కారం అందుకున్నారు. ఆమెతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఈ పురస్కారాలు అందుకున్నారు.
30 ఏళ్ల ఈషా అంబానీ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. సైకాలజీ పూర్తి చేసిన ఈషా అంబానీ ఆ తరువాత స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ డిగ్రీ అభ్యసించారు. ఆమె యూఎస్ నుండి తిరిగి వచ్చే ముందు మెకిన్సే అండ్ కంపెనీలో కొంతకాలం వ్యాపార విశ్లేషకురాలుగా కూడా పనిచేశారు. బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తనయ ఈషా అంబానీ పిరామిల్ గ్రూప్ కి చెందిన అజయ్ మరియు స్వాతి పిరామిల్ ల కుమారుడు అయిన ఆనంద్ పిరామిల్ ను వివాహం చేసుకున్నారు.

గత ఏడాది నవంబర్ 19వ తేదీన ఆమె కృష్ణ మరియు ఆదియా అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆమె పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు ఆ తర్వాత ఇషా అంబానీ వారిని తీసుకొని ముంబైకి చేరుకోవడంతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అలాగే అజయ్ మరియు స్వాతి పిరామిల్ కుటుంబాలు సంబరాలు జరుపుకున్నాయి. కుమార్తె,కు మనవళ్లకు అంబానీ, పిరామిల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి.
#FILA2023: Gennext Entrepreneur award goes to Isha Ambani, Director, Reliance Retail Ventures.
— Forbes India (@ForbesIndia) March 24, 2023
Watch Forbes India Leadership Awards 2023 here: https://t.co/koM5PsyQcS pic.twitter.com/vOg2J3F8EN
2008వ సంవత్సరంలో ఫోర్బ్స్ రూపొందించిన యంగెస్ట్ బిలియనీర్ వారసురాలు జాబితాలో ఈషా అంబానీ ద్వితీయ స్థానాన్ని సంపాదించారు. 471 కోట్ల రూపాయల నికర విలువతో ఆమె ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు. 2016 లాక్ మీ ఫ్యాషన్ వీక్ లో ఈషా ఆన్లైన్ ఫ్యాషన్ రిటైలర్ గా నిలిచారు. రిలయన్స్ రిటైల్ యొక్క అనుబంధ సంస్థ అయిన అజియో ను ప్రారంభించి ఈషా సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇక ఈషా అంబానీ తో పాటు టైటాన్ సీఎండీ సీకే వెంకట్రామన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్ గా, మ్యాక్స్ హెల్త్ కేర్ సిఎండి అభయ్ సోయి ఎంట్రప్రెన్యూర్ అఫ్ ది ఇయర్ అవార్డులను కూడా దక్కించుకున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications