వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలకు మతిపోయింది, అందుకే శశికళను: మాజీ మంత్రి

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే శాసన సభ్యులకు మతిపోయిందని, అందుకే శాసనసభాపక్ష నేతగా వీకే. శశికళను ఎన్నుకున్నారని ఆపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేపీ. మునిసామి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ మీద విరుచుకుపడ్డారు.

అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో, జయలలిత చరిష్మాతో తమిళనాడులో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అయితే అలా ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వారికి ఇష్టం లేకపోయినా ప్రజలను వ్యతిరేకిస్తూ శశికళను ముఖ్యమంత్రిని చెయ్యడానికి సిద్దం అయ్యారని ఆరోపించారు.

Former AIADMK Minister KP Munusamy has condemned to the MLA’s decision on Sasiaka as CM of Tamil Nadu.

శశికళ నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కేపీ. మునిసామి అన్నారు. అలాంటిది ప్రజలను అభిప్రాయాన్ని కాదని శశికళను సీఎం చేస్తున్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుస్తారా ? అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థులను గెలిపించే సత్తా శశికళకు ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.

జయలలిత నమ్మిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అమ్మ అభిప్రాయాలకు భిన్నంగా శశికళను సీఎం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి నాయకులను ప్రజలు క్షమించరని చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదని, సరైన వ్యక్తిని సీఎం చేసి తమిళనాడును అభివృద్ది చెయ్యడానికి నాయకులు సిద్దం కావాలని మాజీ మంత్రి కేపీ. మునిసామి సూచించారు.

English summary
Former AIADMK Minister KP Munusamy has condemned to the AIADMK MLA’s decision on Sasiaka as Chief Minister of Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X