చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress Chandini rape case: మూడుసార్లు అబార్షన్: ఎట్టకేలకు చిక్కిన మాజీమంత్రి..అరెస్ట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సంచలనం రేపిన నటి చాందినిపై అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్ కేసు.. మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న అన్నా డీఎంకే సీనియర్ నాయకుడు, తమిళనాడు మాజీ మంత్రి ఎం మణికందన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మణికందన్ ఆచూకీ బెంగళూరులో తేలింది. మణికందన్ ఆచూకీ తెలియడంతో చెన్నై సిటీ పోలీసులు ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకు తీసుకెళ్లారు. అనంతరం ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు.

ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా..

ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా..

ముందస్తు బెయిల్ కోసం మణికందన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. అండర్ గ్రౌండ్‌లో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. దీనికోసం ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను తమిళనాడు హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మణికందన్ నటి చాందినితో సహజీవనం చేసినట్లు గానీ, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గానీ సాక్ష్యాధారాలు లేవంటూ ఆయన తరఫున న్యాయవాదులు చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. యాంటిసిపేటరీ బెయిల్ పిటీషన్ తోసిపుచ్చడంతో మణికందన్ కోసం పోలీసులు అన్వేషణ సాగించారు.

ఎవరీ చాందిని..?

ఎవరీ చాందిని..?

మలేషియాకు చెందిన నటి చాందిని. పలు తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటోన్న సమయంలో 2017లో అప్పటి ఐటీ మంత్రి ఎం మణికందన్‌తో పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధానికి దారి తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో చెన్నైలోని శాస్త్రీనగర్‌లో వారిద్దరూ అయిదేళ్ల పాటు సహజీవనం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. శారీరక అవసరాలు తీరిన తరువాత మణికందన్ తనను పట్టించుకోవట్లేదని, పెళ్లి మాటను దాటేస్తూ వచ్చారనేది చాందిని ఆరోపణ.

రెండో పెళ్లి కోసం..

రెండో పెళ్లి కోసం..

తనతో పెళ్లి కోసం భార్యకు విడాకులు సైతం ఇస్తానని నమ్మించినట్లు చాందిని పేర్కొన్నారు. ఆయనపై పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో భార్యకు విడాకులు ఇవ్వడం, రెండో పెళ్లి చేసుకోవడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనే కారణాన్ని చెబుతూ తనను పెళ్లి చేసుకునే విషయాన్ని ఎప్పటికప్పుడు దాట వేస్తే వచ్చాడని చాందిని ఆరోపించారు. మూడుసార్లు బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికందన్‌కు అత్యంత ఆప్తుడైన ఓ డాక్టర్ తనకు అబార్షన్ చేశాడని, దీనికి తన వద్ద సాక్ష్యాలలు ఉన్నాయని చెప్పారు.

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
బెంగళూరులో అరెస్ట్..

బెంగళూరులో అరెస్ట్..

పెళ్లి చేసుకోవాలంటూ తాను ఒత్తిడిని తీసుకొస్తుండటంతో చంపేస్తానంటూ బెదిరించినట్లు చాందిని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే- తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన అశ్లీల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాననీ మణికందన్ బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిపారు. చాందిని కేసు పెట్టిన తరువాత మణికందన్ మాయం అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అండర్ గ్రౌండ్‌లో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అవేవీ ఫలించలేదు. తాజాగా ఆయన బెంగళూరులో ఉన్నట్లు తెలియడంతో చెన్నై సిటీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

English summary
Former AIADMK minister M Manikandan was arrested in Bengaluru by the Chennai city police for allegedly raping a Malaysian woman, causing miscarriage as well as for criminal intimidation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X