ప్రకాష్ సింగ్ బాదల్ ఓటమే ధ్యేయంగా లాంభీ నుండి అమరీందర్ సింగ్ పోటీ

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ లాంబీ నియోజకవర్గం నుండి కూడ నామినేషన్ దాఖలు చేశాడు. ఈ నియోజకవర్గం నుండి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఛండీఘడ్ :పంజాబ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో అకాలీదళ్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వ విజయ పరంపరకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు అస్త్రాలతో ఆ పార్టీ సన్నద్దమౌతోంది. అయితే ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దాఖలు చేశాడు.

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది.ఆ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. పార్టీకి అందివచ్చే ప్రతి అవకాశాన్ని దక్కించుకొనేందుకుగాను అమరీందర్ సింగ్ ప్రయత్నిస్తున్నాడు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు అమరీందర్ సింగ్ అన్ని తానై వ్యవహరిస్తున్నాడు.

పార్టీ నుండి ఇతర పార్టీలకు వెళ్ళిన నాయకులు కూడ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రప్పించేలాల అమరీందర్ సింగ్ చేస్తోన్న ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. అకాళీదళ్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలుపుబాటలో పయనించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

ప్రకాష్ సింగ్ బాదల్ పై అమరీందర్ సింగ్ పోటీ

ప్రకాష్ సింగ్ బాదల్ పై అమరీందర్ సింగ్ పోటీ

పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ లాంబీ నియోజకర్గం నుండి పోటీచేస్తున్నాడు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజే ప్రకాష్ సింగ్ తన నామినేషన్ ను లాంబీ నియోజకవర్గం నుండి దాఖలు చేశాడు. ఈ స్థానం నుండి ఆయన చాలకాలం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిసిసి అధ్యక్షుడు అమరీందర్ సింగ్ పోటీచేస్తున్నాడు.ఈ మేరకు లాంబీ నియోజకవర్గం నుండి ఆయన పోటీచేస్తున్నారు.

రెండు అసెంబ్లీ స్థానాల నుండి అమరీందర్ సింగ్ పోటీ

రెండు అసెంబ్లీ స్థానాల నుండి అమరీందర్ సింగ్ పోటీ

కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి గా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిపై తాను పోటీచేస్తానని ఆయన ప్రకటించారు. అయితే పార్టీ అధిష్టానం నుండి ఆయన అనుమతి కోరారు. అప్పటికే ఆయన పాటియా అర్బన్ సీటుకు నామినేషన్ దాఖలు చేశాడు.పార్టీ అధిష్టానం కూడ అమరీందర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయన లాంబీ అసెంబ్లీ స్థానం నుండే నామినేషన్ దాఖలు చేశారు.

పంజాబ్ లో త్రిముఖ పోటీ

పంజాబ్ లో త్రిముఖ పోటీ

పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం ఉంది.అకాలీదళ్ బిజెపి,ఆప్ , కాంగ్రెస్ పార్టీల మద్య త్రిముఖ పార్టీ నెలకొనే అవకాశం ఉంది. 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో ఈ రాష్ట్రంపై ఆప్ ఆశలు పెట్టుకొంది.అయితే అకాళీదల్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్న పరిస్థితులున్నందున తమకు కలిసివచ్చే అవకాశం ఉందని ఆప్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.అయితే ఎవరికీ ఇది కలిసివస్తోందో చూడాలి.

అకాలీదళ్ , బిజెపి ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన

అకాలీదళ్ , బిజెపి ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన

అకాలీదళ్, బిజెపి సంకీర్ణ కూటమి ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరేలా ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి.సిద్దూ కాంగ్రెస్ లో చేరారు. మరో వైపు బిజెపి గూటికి చేరిన మాజీముఖ్యమంత్రి కుమార్తె గురు కన్వాల్ కౌర్ తిరిగి స్వంత గూటికి వచ్చేలా కృషి చేశారు. అయితే ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపుకు మొగ్గుచూపుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+