జీ టీవీని కొనేసిన పన్నీర్ సెల్వం: ఇక జీటీవీ చానల్ పేరు మారిపోతోంది !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జీ టీవీ అనే తమిళ చానల్ ను కొనేసి దానికి త్వరలో అమ్మ టీవీ చానల్ అనే పేరుమార్చి శశికళ వర్గీయులకు సినిమా చూపించడానికి సిద్దం అవుతున్నారు.

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇక ఆట మొదలు పెట్టడానికి సిద్దం అయ్యారు. శశికళ వర్గానికి సినిమా చూపించడానికి ఓ టీవీ చానల్ ను ప్రజల ముందుకు తీసుకురావడానికి పన్నీర్ వర్గం రంగం సిద్దం చేసింది.

ఇప్పటికే తమిళనాడులో ప్రసారం అవుతున్న టీవీ చానల్ ను కొనుగోలు చేసి త్వరలో పేరు మార్చి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు. తాము అమ్మ టీవీ చానల్ ను త్వరలోనే ప్రారంభిస్తామని పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు పూర్తి అయిన తరువాత అమ్మ టీవీ చానల్ కు శ్రీకారం చుడుతామని పన్నీర్ సెల్వం వర్గీయులు తెలిపారు. అయితే ఇప్పటికే తమిళనాడులో ప్రసారం అవుతున్న మడిప్పాకం విశ్వనాథంకు చెందిన జీ టీవీని పన్నీర్ సెల్వం వర్గీయులు కొనుగోలు చేశారు.

Former chief minister O.Paneerselvam bought the G TV from Madipakkam Velayutham.

ఇప్పుడు మడిప్పాకం వేలాయుధంకు చెందిన జీ టీవీని అమ్మ టీవీగా పేరు మార్చి అధికారికంగా ప్రసారం చెయ్యడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు నిర్ణయించారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కలిసి అమ్మ జయలలితకు చేసిన ద్రోహం గురించి ఇక ముందు అమ్మ టీవీ చానల్ లో కథనాలు ప్రసారం అవుతాయని సమాచారం.

తాము కొత్తగా ప్రరంభించే చానల్ కు అమ్మ టీవీ 24x7 న్యూస్ చానల్ అని పేరుపెడుతామని ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గీయులు ప్రకటించారు. మొత్తం మీద పన్నీర్ సెల్వం వర్గం ఇప్పుడు మీడియా రంగంలో అడుగుపెట్టి ఎలాంటి సంచలనాలు వెలుగులోకి తీసుకువస్తారో వేచి చూడాలి అంటున్నారు అమ్మ అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+