చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

9 మంది తమిళనాడు సీఎంల చావు కళ్లారా చూసిన కరుణానిధి

భారతదేశంలోని రాజకీయ నాయకుల్లో కురవృద్దుడు అయిన డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇప్పుడు అపురూపమైన కొన్ని విషయాలకు ప్రత్యక్ష సాక్షి అయ్యారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారతదేశంలోని రాజకీయ నాయకుల్లో కురవృద్దుడు అయిన డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇప్పుడు అపురూపమైన కొన్ని విషయాలకు ప్రత్యక్ష సాక్షి అయ్యారు. ఆ విషయాలు వింటే మీరు కచ్చితంగా షాక్ కు గురౌతారు.

డీఎంకే పార్టీకి అన్ని తానై ఒంటి చేతితో ఇంత కాలం చక్రం తిప్పిన కరుణానిధి (92) ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో రాజకీయంగా ఎక్కువగా జయలలితో ఆయనకు విభేదాలు తలెత్తాయి.

వ్యక్తిగతంగా ఎలా ఉన్నా రాజకీయంగా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. భారతదేశంలోనే ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుల్లో కరుణానిధి మొదటి వరసలో ఉంటారు. వీల్ చేర్ లో కుర్చుని పార్టీ పగ్గాలు చేతపట్టుకున్నారు.

1969లో డీఎంకే పార్టీని స్థాపించిన అన్నాదురై మరణించిన తరువాత పార్టీ పగ్గాలు చేతపట్టుకున్నకురుణానిధి సీఎం అయ్యారు. అప్పటి నుంచి నేటి వరకు తమిళనాడుకు చెందిన 9 మంది సీఎంలో మరణించారు.

ఆ 9 మంది సీఎంలు కరుణానిధి కళ్ల ముందే అనంతలోకాలకు వెళ్లిపోయారు. డీఎంకే నాయకులు రాజకీయ శత్రువుగా భావించే అన్నాడీఎంకే చీఫ్ జయలలిత సైతం ఇదే నెల 6వ తేదిన అనంతలోకాలకు వెళ్లిపోయారు. అందుకు సాక్షం రాజకీయ కురవృద్దుడు కరుణానిధి. కరుణానిధి కళ్ల ముందే మరణించి 9 మంది తమిళనాడు సీఎంలు ఎవరో మీరే చూడండి.

భక్తవత్సలం

భక్తవత్సలం

09.10.1897లో ఎం. భక్తవత్సలం జన్మించారు.1963 నుంచి 1967 వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈయన 1967లో మరణించారు.

అన్నాదురై

అన్నాదురై

సీఎన్. అన్నాదురై 1909 సెప్టెంబర్ 15వతేది జన్మించారు. తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1967 నుంచి 1969 వరకు సీఎంగా ఉన్నారు. 1969 ఫిబ్రవరి 3వ తేది అన్నాదురై మరణించారు.

రామసామి రెడ్డి

రామసామి రెడ్డి

రామస్వామి రెడ్డి 1895లో జన్మించారు. 1947 నుంచి 1949 కాలంలో అప్పటి మద్రాసు సంస్థానానికి (తమిళనాడు) ముఖ్యమంత్రిగా పని చేశారు. 1970లో రామసామి రెడ్డి మరణించారు.

రాజాజీ

రాజాజీ

చక్రవర్తి రాజగోపాలాచారి అలియాస్ రాజాజీ. 1878 డిసెంబర్ 10వ తేదిన జన్మించారు. 1952 నుంచి 1954 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు.

కామరాజ్

కామరాజ్

కుమారసామి కామరాజ్ నడార్ 1954 ఏఫ్రిల్ 13వ తేదిన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 1975లో కామరాజ్ మరణించారు. కామరాజ్ మరణించిన తరువాత భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి ఆయన్ను గౌరవించింది.

ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్)

ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్)

1917 జనవరి 17వ తేదిన మరుదూరు గోపాలన్ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ జన్మించారు. తమిళ సినీరంగంలో మకుటం లేని మహారాజుగా వెలిగారు. దాదాపు 10 సంవత్సరాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1987 డిసెంబర్ 24వ తేదిన ఎంజీఆర్ మరణించారు.

నడుంచెళియన్

నడుంచెళియన్

1920 జులై 11వ తేదీన వీఆర్. నడుంచెళియన్ జన్మించారు. 1987 డిసెంబర్ 24 నుంచి 1988 జనవరి 7 వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2000 జనవరి 12వ తేది నడుంచెళియన్ మరణించారు.

జానకి రామచంద్రన్

జానకి రామచంద్రన్

జానకి రామచంద్రన్ 1988 జనవరి 7 నుంచి 1988 జనవరి 30 (24 రోజులు) తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎంజీఆర్ సతీమణి అయిన జానకి రామచంద్రన్ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమె తన పదవిని కొల్పోయారు. 1996 మే 19వ తేదిన జానకి రామచంద్రన్ మరణించారు.

జే. జయలలిత

జే. జయలలిత

1948 ఫిబ్రవరి 24వ తేది జన్మించిన జయలలిత మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలైనారు. 2016 డిసెంబర్ 5వ తేదిన ఆమె మరణించారు. ఈ 9 మంది సీఎంలు కరుణానిధి రాజకీయాల్లో ఉన్న సమయంలోనే మరణించారు.

English summary
Senior politician, DMK Supremo and former Chief Minister of Tamilnadu M Karunanidhi witnessed 9 death news of Chief Ministers of state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X