విమాన ప్రమాదం.. మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ కూడా ఒకరు.

ఎయిర్ ఇండియా విమాన శకలాల నుంచి మృతదేహాలను వెలికి తీసిన అధికారులు డీఎన్ఏ టెస్టు నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. అయితే ఈ క్రమంలో మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహాన్ని గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. దీంతో విజయ్ రూపాణీ అంత్యక్రియలకు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. జూన్ 15న ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Former Gujarat CM Vijay Rupani s Body Identified in Tragic Air India Crash

జూన్ 15 ఆదివారం నాటికి 32 మృతదేహాలను గుర్తించారు. వీటిలో 14 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. అయితే మాజీ సీఎం విజయ్ రూపాణీని మృత్యువు వెంటాడిందని చెప్పవచ్చు. తొలుత ఆయన మే 19 తారీఖునే లండన్ వెళ్లాల్సి ఉంది. కానీ టికెట్ క్యాన్సెల్ అయింది. జూన్ 5 మళ్లీ బుక్ చేసుకోగా అది కూడా క్యాన్సెల్ కావడం గమనార్హం. చివరగా జూన్ 12న టికెట్ బుక్ చేసుకున్నారు. లండన్ లో ఉన్న తన భార్య, కూతురు దగ్గరకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు విజయ్ రూపాణీ.

విజయ్ రూపాణీకు మృదు స్వభావిగా మంచి పేరుంది. ఆయన 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండు సార్లు గుజరాత్ సీఎంగా పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేశారు విజయ్ రూపాణీ. ఆయన మృతితో రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ప్రముఖులు, వీఐపీలు" విజయ్ రూపాణీ మృతితో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన లక్కీ నంబర్ 1206 అట. విజయ్ రూపాణీ కారు నంబర్, బైక్ నంబర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు 12 జూన్ అంటే 12-06 తేదీనే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. లక్కీ నంబర్ తేదీ రోజే విజయ్ రూపాణీ మృతి చెందడం బీజేపీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

అయితే అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్ప కూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు.

అయితే ఇంతటి ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కడు మాత్రమే బతికి బయట పడ్డాడు. అతడే 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేశ్. అతడు 11A సీటులో కూర్చొన్నాడు. విమానం కుప్పకూలిన ఘటనలో అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+