బీజేపీలోకి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ?, ఆ వార్త నిజం కాదు: బీజేపీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ కామేంటేటర్ సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన సౌరభ్ గంగూలీ వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు సఫలమైతే గంగూలీ బీజేపీలోకి చేరడం ఖాయమని భావిస్తున్నారు.
భారత క్రికెట్లో తన కంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్నాడు దాదా. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల ముందు కూడా గంగూలీ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సౌరభ్ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నప్పటికీ ఖండిస్తూ వచ్చాడు.

రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశాడు. గత ఏడాది సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఎంపీ సీటును సౌరభ్ గంగూలీ సున్నితంగా తిరస్కరించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న దాదా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా క్రికెట్ కామేంటేటర్‌గా మారాడు.
ప్రధానమంత్రి మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సౌరభ్‌ను డిసెంబర్ 2014న నామినేట్ చేశారు. స్వచ్చ్ భారత్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు గంగూలీ స్పందిస్తూ ప్రధాని ఆహ్వానం మేరకు స్వచ్చ్ భారత్‌లో పాల్గొంటానని కాని రాజకీయాలలోకి మాత్రం రానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
గంగూలీ బీజేపీలో చేరుతారన్న వార్త నిజం కాదు: బీజేపీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్దార్ధ నాథ్ సింగ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
బీజేపీలోని కొంత మంది నాయకులు ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో చేరే విషయమై ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications