మీపని మీరు చేసుకునిపోతే మీకే మంచింది, 5 నెలల్లో మీ అంతు చూస్తాం, మాజీ సీఎం !

బెంగళూరు/హావేరి: అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ప్రత్యర్థ పార్టీల నాయకుల మీద ప్రతీకారం తీర్చుకోవడం, ప్రత్యర్థి రాజకీయ పార్టీ కార్యకర్తల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని మాజీ సీఎం చాలా సీరియస్ గా హెచ్చరించారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం ముఖ్యం కాదు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి అంటూ మాజీ సీఎం సవాలు విసిరారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గుజరాత్ ప్రయోగాలు చేసి చివరికి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ప్రయోగాలు ల్యాబ్ లో చెయ్యాలని, రాజకీయాల్లో కాదని కర్ణాటక ప్రజలు నిరూపించడంతో బీజేపీకి చుక్కలు కనపడ్డాయి.

bjp- congress

కర్ణాటకలోని హావేరి జిల్లాలోని శిగ్లావిలోని సొంత నియోజక వర్గంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఐదు నెలల తరువాత ఏమి అవుతుందో మీరే చూస్తారు, అన్ని రోజులు ఓపికగా ఉండాలని, తరువాత పరిస్థితులు తారుమారు అవుతాయని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ జోస్యం చెప్పారు.

ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇన్ని రోజులు అయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ హెచ్చరించారు.

bjp- congress

అధికారంలో ఉన్నామనే ధీమాతో బీజేపీ కార్యకర్తల మీద ప్రతీకార చర్యలకు పాల్పడితే తగినబుద్ది చెబుతామని, మీ పని మీరు చేసుకుని వెళితే మీకే మంచిదని కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+