గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకు మైండ్ బ్లాక్, ఆ నాయకులు ఏం అయ్యారంటే ? మొత్తం పోయే !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మరోసారి కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను కుదిపేశారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ నుంచి గాలి జనార్దన్ రెడ్డి భారీ మోజారిటీ ఓట్లు సంపాధించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ జాతీయ అధ్యక్షుడు, రామన్న, బెంగళూరు అనే పేరుతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈనెల 26వ తేదీన గురువారం కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ బెంగళూరు కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగిందని, పార్టీని బలోపేతం చేసే విషయంలో ఈ సమావేశంలో చర్చించామని వివరించారు. ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశామని జే రామన్న ఆ ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం అక్టోబర్ 26వ తేదీ నుంచి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, తాలూకా, గ్రామీణ కమిటీలతో పాటు అన్ని కమిటీలు రద్దు చేయాలని నిర్ణయించామని రామన్న ఆ ప్రకటనలో తెలిపారు.

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా అన్ని యూనిట్లకు అనువైన కొత్త ఆఫీస్ బేరర్లను త్వరలో నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని రామన్న ఓ ఆ ప్రకటనలో తెలిపారు. 2022 డిసెంబర్ 25వ తేదీన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులోని ఆయన పారిజాత నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
నేను ఎన్నో సంవత్సరాలు పనిచేసిన బీజేపీకి తాను రాజీనామా చేస్తున్నానని, కర్ణాటక రాష్ట్రంలోని తన అభిమానులు, అనుచరుల కోసం కొత్త పార్టీని స్థాపించి ముందడుగు వేస్తానని ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పళ జిల్లా గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అదే రోజు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి భార్య గాలి లక్ష్మీ అరుణ పోటీ చేశారు. గంగావతి నియోజకవర్గంలో గాలి జనార్దన్ రెడ్డి 66,213 ఓట్లతో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇక్బాల్ అన్సారీకి 57,947 ఓట్లు రావడంతో ఆయన ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కల్యాణ రాజ్య ప్రగతి పార్టీకి చెందిన అన్ని కమిటీలను గాలి జనార్దన్ రెడ్డి రద్దు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ అభ్యర్థులు కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకే పార్టీలోని అన్ని కమిటీలను రద్దు చేసి మళ్లీ కమిటీలు వేయాలని గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయించారని తెలిసింది. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీని స్థాపించిన గాలిజనార్దన్ రెడ్డి కొంతకాలం క్రితం మీడియాతో మాట్లాడుతూ కొందరి మాటలు విన్నానని, తాను నమ్మినవాళ్లే తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బసవన్న చెప్పినట్లుగా కుల, మత భేదాలు లేకుండా, అణచివేతలు లేకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నానని, అందుకే తాను పని చేసిన బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని స్వతంత్రంగా బతకాలని నిర్ణయించుకున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను మాజీ ప్రధాని వాజ్‌పేయిని స్మరించుకుని ప్రజా జీవితంలోకి మళ్లీ రావాలని నిర్ణయించుకున్నాను అని గాలి జనార్దన్ రెడ్డి న్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల కోసం గాలి జనార్ధన్ రెడ్డి నేతృత్వంలోని కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ ఆపార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం గంగావతిలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి భార్య గాలి లక్ష్మీ అరుణతో పాటు ఆ పార్టీ నాయకులు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు సొంత పార్టీలోని ఏ టూ జడ్ కమిటీలు రద్దు చేసిన గాలి జనార్దన్ రెడ్డి మరోసారి కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యారు.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications