దమ్ముంటే ప్రమాణం చెయ్యండి, సీఎం, డీసీఎం, మంత్రులకు సవాల్, ఆ గుడిలో తప్పు చేస్తే !

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాణస్వీకార సవాళ్లు మొదలయ్యాయి. జీడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి సవాల్ విసిరిన మగాడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద మాజీ సీఎం కుమారస్వామి ఎదురుదాడి చేశారు. దెబ్బకు సిద్దరామయ్య ప్రభుత్వానికి చుక్కెదురైంది. మీకు నిజంగా ధైర్యం ఉంటే ధర్మస్థలానికి వచ్చి ప్రమాణం చేయాలని మాగాడి ఎమ్మెల్యే బాలకృష్ణకు మాజీ సీఎం కుమారస్వామి సవాల్ విసిరారు.

గురువారం జేడీఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాని, డీసీఎం డీకే శివకుమార్‌ సహా మంత్రులంతా వారి మాటలకు కట్టుబడి ప్రమాణం చేయాలి. గత ఐదు నెలలుగా బదిలీపై ప్రభుత్వం పెద్దలు డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయడానికి ధర్మస్థలానికి రావాలని వారిని మాజీ సీఎం కుమారస్వామి ఆహ్వానించారు.

HD Kumaraswamy challenged the CM and ministers to take an oath in Dharamsthal that they did not take bribes

ఇదే సమయంలో తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్‌ను స్వీకరిస్తున్నానని కుమారస్వామి అన్నారు. ఇదే సమయంలో వాళ్లు కూడా నా సవాలును స్వీకరించాలని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్ చేశారు. నేను, నా కుటుంబం ప్రభుత్వ సొమ్మును దోచుకోలేదని, అధికారుల నియామకంలో డబ్బులు తీసుకోలేదని, ఈ విషయంలో నేను ధర్మస్థలంలోని శ్రీ మంజునాథ స్వామి సన్నిధిలో కాని, చాముండేశ్వరి మాత సన్నిధిలో ప్రమాణం చేయడానికి నేను సిద్ధమేనని కుమారస్వామి అన్నారు.

HD Kumaraswamy challenged the CM and ministers to take an oath in Dharamsthal that they did not take bribes

ఎన్నికల సమయంలో మా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టలేదని చాలాసార్లు చెప్పానని, ఈ విషయాన్ని శాసన సభలోనే చెప్పానని, మా పనితనం చూసి కొంత మంది ఇచ్చిన విరాళంతో పార్టీ పెట్టామని, అదే డబ్బుతో ఎన్నికలను ఎదుర్కొన్నామని, పాపపు డబ్బుతో ఎన్నికల్లో పోటీ చెయ్యలేదని కాంగ్రెస్ నాయకుల మీద కుమారస్వామి విరుచుపడ్డారు.

HD Kumaraswamy challenged the CM and ministers to take an oath in Dharamsthal that they did not take bribes

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఈ కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో అందరికి తెలిసిందే అని, ప్రభుత్వంలో 5 నెలలుగా అధికారుల బదిలీల చేసి డబ్బులు మీరు తీసుకోలేదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరు బదిలీలు చెయ్యడానికి డబ్బులు తీసుకోలేదని సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తో సహా మంత్రులందరూ ధర్మస్థలం వచ్చి ప్రమాణం చేయాలని కుమారస్వామి సవాలు విసిరారు. మీరు దోపిడీ దొంగల అని ప్రపంచం మొత్తానికి తెలుసని మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+