వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని కుటుంబంలో విషాదం -కరోనాతో వాజపేయి మేనకోడలు కరుణా శుక్లా మృతి

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్నది. రోజువారీ కేసులు, మరణాలు ప్రపంచ రికార్డులను అధిగమిస్తున్నాయి. సామాన్యులతోపాటు ప్రముఖులెందరినో వైరస్ పొట్టనపెట్టుకుంటున్నది. ఇవి చాలదన్నట్లు ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్యా కలవరపెడుతోంది. మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బీహారీ వాజపేయి కుటుంబంలోనూ కరోనా విషాదాన్ని నింపింది..

 జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు జస్టిస్ రమణకే షాకిచ్చారు -వారిపై పోలీసులకు సీజేఐ ఫిర్యాదు -సుప్రీంకోర్టు పరిశీలనలో కీలక అంశాలు

దివంగత మాజీ ప్రధాని వాజపేయికి ఎంతో ఇష్టురాలైన ఆయన మేనకోడలు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కరుణా శుక్లా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కోవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో రాయపూర్‌(ఛత్తీస్‌గఢ్)లోని రామకృష్ణా కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. బలోడాబజార్‌లోని క్రిమిటోరియంలో ఇవాళ సాయంత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

Former PM Atal Bihari Vajpayees Niece Karuna Shukla Dies Of Coronavirus

వాజపేయి మేనకోడలు కరుణా శుక్లా మృతి పట్ల ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలతోపాటు పలువురు సంతాపాలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా కరుణా శుక్లా కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ తెలిపారు. కరోనాకు కరుణ లేకుండా పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులుజగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులు

కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 3,23,144 కొత్త కేసులు, 2,771 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307 (1.76 కోట్లు) కు, మరణాల సంఖ్య 1,97,894కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులున్నాయి. తొందర్లోనే ఈ సంఖ్య 35 లక్షలకు చేరుతుందని నిపుణులు హెచ్చరించారు.

English summary
Former MP and senior Congress leader Karuna Shukla died of COVID-19 at Ramkrishna CARE Hospitals, Raipur during the early hours of Tuesday. Karuna Shukla, the niece of former Prime Minister Atal Bihari Vajpayee, was undergoing treatment for Covid-19 after she had tested positive for infection. The last rites will be performed today in Balodabazar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X