అమిత్ షాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ ప్రధాని, వెనుకా ముందు !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో ఒక పార్టీ మీద ఒక పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు జేడీఎస్ దళపతి, మాజీ ప్రధాన మంత్రి హెచ్.డీ. దేవేగౌడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మా పార్టీకి డబ్బులు లేకపోవచ్చు, అయితే ప్రజల ఆశీర్వాధం ఉందని, అందుకే తాము ఒంటరిగా పోరాటం చేస్తున్నామని, ఏదైనా మాట్లాడే సమయంలో వెనుకా ముందు ఆలోచించి మాట్లాడాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్.డీ. దేవేగౌడ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి కేంద్ర మంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. సోమవారం హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ గా జేడీఎస్ పార్టీ వ్యవహరిస్తోందని, జేడీఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్లే అని, జేడీఎస్ పార్టీ కుటుంబ రాజకీయాలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు.
మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మరోసారి జేడీఎస్ ను బీ టీమ్ తో పొల్చారు. ఈ సందర్బంలో మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కేంద్ర మంత్రి అమిత్ షా మీద మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే మేము. మా పార్టీ నాయకులు పెద్దగా పట్టించుకోరని, అయితే పార్టీ పేరుతో విమర్శలు చేస్తే సహించమని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ హెచ్చరించారు.
మాజీ సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో మా జేడీఎస్ పార్టీ 207 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్నదని, మూడు స్థానాల్లో సీపీఐ, మూడు స్థానాల్లో ఆర్ పీఐ, మరోచోట మరో వ్యక్తికి మద్దతు ఇస్తున్నామని, ప్రతిరోజు 3 నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థుల తరపున మేము ప్రచారం చేస్తున్నామని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ గుర్తు చేశారు. మా పార్టీ మీద విమర్శలు చేసే ముందు మీ పార్టీ గురించి ఆలోచించుకోండి అంటూ కేంద్ర మంత్రి అమిత్ షాకు మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications