Kalyan Singh : ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత...

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత కళ్యాణ్‌సింగ్‌(89) కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. గత జులై 4వ తేదీ నుంచి ఢిల్లీలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SGPGIMS)లోని ఐసీయూ కేర్‌లో కల్యాణ్ సింగ్ చికిత్స పొందుతున్నారు.నెఫ్రాలజీ,కార్డియాలజీ,న్యూరాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్య నిపుణుల ప్యానెల్ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చింది. అయితే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శనివారం ఆయన కన్నుమూశారు.

కల్యాణ్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 'నేను మాటలకందని బాధలో ఉన్నాను.కల్యాణ్ సింగ్ జీ... రాజనీతిజ్ఞుడు, అనుభవజ్ఞుడైన పాలకుడు, గొప్ప నేత, గొప్ప వ్యక్తి. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ చెరిగిపోనిది. కల్యాణ్ సింగ్ కుమారుడు శ్రీ రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడి సంతాపం తెలిపాను.ఓం శాంతి.' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

 former uttar pradesh cm kalyan singh passed away at delhi hospital

భారతదేశ సాంస్కృతిక పునరుత్తేజానికి కల్యాణ్ సింగ్ చేసిన కృషికి రాబోయే తరాలు కృతజ్ఞతలు చెబుతాయని మోదీ పేర్కొన్నారు. భారతీయ విలువల్లో ధృఢంగా పాతుకుపోయిన ఆయన.. సమాజంలోని కోట్లాది మంది అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచారని అన్నారు. రైతులు,యువకులు,మహిళా సాధికారత కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్ షా,పలువురు రాజకీయ ప్రముఖులు కల్యాణ్ సింగ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కల్యాణ్ సింగ్ మృతికి అంజలి ఘటిస్తున్నాయి.

కల్యాణ్ సింగ్‌కు కుమారుడు రాజ్‌వీర్ సింగ్,కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. రాజ్‌వీర్ సింగ్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు.60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కళ్యాణ్‌సింగ్‌.. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌కు గవర్నర్‌గా ఉన్నారు. 1992లో కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేత జరిగింది. అప్పట్లో బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి 1997లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.1999లో పార్టీని వీడిన కల్యాణ్ సింగ్ సొంత పార్టీని ఏర్పాటు చేశారు.ఆ తర్వాత 2004లో వాజ్‌పేయి కోరడంతో తిరిగి బీజేపీలో చేరారు.ఆ తర్వాత కూడా పార్టీ మారినప్పటికీ 2013లో మళ్లీ బీజేపీలోనే చేరారు.

Recommended Video

    Spl Coverage on Muralidhar rao Comments

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+