మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమం

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూ చికిత్స పొందుతున్నారని వెల్లడించాయి. కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, మంగళవారం సాయంత్రం నుంచి ఆయనను లైఫ్ సేవింగ్ సపోర్ట్‌పై ఉంచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

సీనియర్ వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. 89ఏళ్ల కళ్యాణ్ సింగ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జులై 4వ తేదీన ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చారు.

Former Uttar Pradesh CM Kalyan Singhs condition critical: Hospital.

అప్పటి నుంచి కళ్యాణ్ సింగ్ ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మంగళవారం యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఆస్పత్రికి వెళ్లి కళ్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కళ్యాణ్.. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య చికిత్స పొందుతున్నారు. కాగా, బీజేపీ హయాంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు కళ్యాణ్. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కళ్యాణ్ సింగ్.. 2014-2019 వరకు రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+