ఊపిరాడక కారులో నలుగురు పిల్లల దుర్మరణం
చెన్నై: తమిళనాడులో బుధవారంనాడు విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి నలుగురు చిన్నారులు కారు ఎక్కారు. తలుపులు మూసుకుపోయి, లాక్ పడింది. దీంతో నలుగురు పిల్లలు కూడా ఊపిరాడక మరణించారు. ఈ విషాద సంఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వేడనాత్తం గ్రామంలో జరిగింది.
వేడనాత్తం గ్రామంలోని దేవాలయం వద్ద బుధవారం జాతర జరుగుతోంది. అక్కడకు వచ్చిన కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు. అక్కడే ఉన్న ఓ పాత కారులో ఎక్కారు. ఆ తర్వాత కారు తలుపులు మూసుకుపోయి లాక్ పడింది.

తలుపులు తెరవడానికి పిల్లలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వారికి ఊపిరాడలేదు. ఎక్కువ సేపు ఊపిరి ఆడకపోవడంతో నలుగురు చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
జాతరకు వస్తే పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వృదయ విదారక దృశ్యాన్ని చూసి జాతరకు వచ్చినవారు కూడా కన్నీరు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications