వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో మూడు గంటల్లో నాలుగు భూకంపాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Four quakes shake Delhi
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని మంగళవారం ఉదయం భూప్రకంపనలు వణికించాయి. మూడు గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. మొదటి ప్రకంపనలు మంగళవారం తెల్లవారుజామున 41 నిమిషాల ప్రాంతంలో వచ్చిన భూకంపం రెక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ఆ తర్వాత వరుసగా 1.41, 1.55, 3.40 గంటలకు భుకంపాలు చోటు చేసుకున్నాయి.

తర్వాతి భూప్రకంపనలు వరుసగా రెక్టార్ స్కేలుపై 3.3, 2.5, 2.8గా నమోదయ్యాయి. మొదటి భూకంపం దక్షిణ ఢిల్లీలోని సైనిక్ ఫార్మ్స్ ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమిలోపల 10 కిలోమీటర్ల నుంచి అవి ఉద్భవించాయి.

రెండో భూకంపం ప్రభావం ఢిల్లీలోని కాకుండా పరిసరాల్లోని నోయిడా, ఘజియాబాదుల్లో కూడా ప్రభావం చూపించింది. భూకంపాల ప్రభావంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

రాత్రి నాలుగు సార్లు భూమి కంపించిందని, పిల్లలు గజగజలాడారని స్థానికులు చెప్పారు. భూకంపాల తీవ్రత మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు కనిపించిందని ఐఎండి తెలిపింది.

English summary

 our earthquakes shook national capital Delhi within a period of 4 hours early today. The first quake measuring 3.1 on Richter scale occurred at 12.41 AM, an Indian Meteorological Department report said. This was followed by three more tremors of 3.3, 2.5 and 2.8 magnitude at 1.41, 1.55 and 3.40 AM, the report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X