సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై మళ్లీ తెగబడ్డ ఉగ్రవాదులు: నలుగరిని హతం చేసిన బలగాలు..
ఉగ్రదాడితో భద్రతా బలగాలు తక్షణం అప్రమత్తమయ్యాయి. దాడులను తిప్పికొట్టేలా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. బందోపొర జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పై సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. సంబల్ లోని 45వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి ప్రయత్నించారు.

ఉగ్రదాడితో భద్రతా బలగాలు తక్షణం అప్రమత్తమయ్యాయి. దాడులను తిప్పికొట్టేలా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. కశ్మీర్ లో ఉగ్ర చర్యలకు నిధులు సమకూర్చుతున్నారన్న ఆరోపణలతో పాకిస్తాన్ కు చెందిన నేతలు, వ్యాపార సంస్థలు, నివాసాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications