DGCA: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్..! ఇక రిఫండ్..!
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే లక్ష్యంతో ఎయిర్ లైన్ సంస్ధల నుంచి టికెట్ల రిఫండ్ నిబంధనలపై కీలక నిర్ణయం తీసుకుంది.
విమానయాన సంస్థల టిక్కెట్ల వాపసు నిబంధనలకు సంబంధించి డీజీసీఏ (DGCA) అనేక సవరణలను ప్రకటించింది. దీంతో రిఫండ్స్ విషయంలో ప్రయాణికులకు ఊరట లభించనుంది.
విమాన ప్రయాణీకులు టికెట్లు బుకింగ్ చేసిన 48 గంటల్లోపు అదనపు ఛార్జీ చెల్లించకుండానే వాటిని కొన్ని షరతులకు లోబడి రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చని డీజీసీఏ తెలిపింది. అంతేకాకుండా టికెట్‌ను నేరుగా బుక్ చేసుకుంటే.. బుకింగ్ చేసిన 24 గంటల్లోపు ప్రయాణీకుడు ఏదైనా లోపాన్ని గుర్తిస్తే..అదే వ్యక్తి పేరుతో దిద్దుబాటు కోసం విమానయాన సంస్థలు ఎటువంటి అదనపు ఛార్జీని విధించకూడదని పేర్కొంది.

ఒక ప్రయాణీకుడు ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే రిఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదే అని డీజీసీఏ తెలిపింది.ట్రావెల్ ఏజెంట్, పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినట్లయితే, ఏజెంట్లు వారి ప్రతినిధులు కాబట్టి వాపసు బాధ్యత విమానయాన సంస్థలదేనని స్పష్టం చేసింది. వాపసు ప్రక్రియ 14 పని దినాలలోపు పూర్తయ్యేలా విమానయాన సంస్థలు చూసుకోవాలని సూచించిది. ప్రయాణీకుడు వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా టిక్కెట్ రద్దు చేసుకునే నిబంధనలకు సంబంధించి మార్పులు చేసింది. తాజాగా తలెత్తిన ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల రిఫండ్ సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications