వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు... 18కి చేరుకున్న మృతుల సంఖ్య (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పాకిస్ధానీ ఉగ్రవాదులు కాల్పులకు బరితెగించారు. ఈరోజు తెల్లవారుజామను భారత జవాన్ల గుడారాల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉదయం నుంచి ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. వీరిలో ఎనిమిది జవాన్లు కాగా, ముగ్గురు పోలీసులు, ఆరుగురు టెర్రరిస్టులు ఉన్నారు. తొలుత బారాముల్లా జిల్లా పరిధిలోని యూరీ సెక్టార్‌లో ఉన్న ఆర్మీ ఫీల్డ్ ఆర్డినెన్స్ క్యాంపులోని ఓ బంకర్‌లోకి చొరబడ్డారు.

వారిని బయటకు రప్పించడానికి సైనికులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య హోరా హోరీ కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో వచ్చే మంగళవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.

యూరీలోని మొహారా, శ్రీనగర్‌లోని సౌరా, షోపియాన్ లను ముష్కరులు తాజాగా దాడులకు పాల్పడ్డారు. షోపియాన్‌లో పోలీసు స్టేషన్ మీద గ్రెనేడ్ దాడి చేసి, ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డ మిలిటెంట్లు పోలీస్ పోస్టుపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి.

ఈ పోలీసు స్టేషన్ కాశ్మీర్ సిటీ సెంటర్ లాల్ చౌక్‌కు కేవలం పది కిలోమీటర్లు దూరం ఉండటం విశేషం. ఈ ఏరియాలో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్ మరణించగా ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దుండగులను లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద గ్రూపుకు చెందిన వారుగా భావిస్తున్నారు.

 కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

జమ్మూ కాశ్మీర్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పాకిస్ధానీ ఉగ్రవాదులు కాల్పులకు బరితెగించారు. ఈరోజు తెల్లవారుజామను భారత జవాన్ల గుడారాల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

 కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

ఈ ఘటనలో ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు భావిస్తున్నారు. వీరిలో ఆరుగురు జవాన్లు కాగా, ముగ్గురు పోలీసులు, ఆరుగురు టెర్రరిస్టులు ఉన్నారు. తొలుత బారాముల్లా జిల్లా పరిధిలోని యూరీ సెక్టార్‌లో ఉన్న ఆర్మీ ఫీల్డ్ ఆర్డినెన్స్ క్యాంపులోని ఓ బంకర్‌లోకి చొరబడ్డారు.

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

శ్రీనగర్ లోని సౌరా జిల్లాలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన కాల్పుల్లో ఫైర్ అయిన బుల్లెట్‌ను చూపిస్తున్న ఓ మహిళ.

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

యూరీలోని మొహారా, శ్రీనగర్‌లోని సౌరా, షోపియాన్ లను ముష్కరులు తాజాగా దాడులకు పాల్పడటంతో... యూరీ ఆర్మీ బేస్ క్యాంప్ వద్ద ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న మిలటరీ అధికారులు.

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

ఉగ్రవాదులకు, సైనికులకు మధ్య హోరా హోరీ కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో వచ్చే మంగళవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు.

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

కాశ్మీర్‌లో వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు దాడులు

బారాముల్లా జిల్లా పరిధిలోని యూరీ సెక్టార్‌లో ఉన్న ఆర్మీ ఫీల్డ్ ఆర్డినెన్స్ క్యాంపులోకి ఎవరనీ అనుమతించకుండా స్టాప్ అంటూ గేట్లు మూసివేస్తున్న దృశ్యం.

English summary
IANS reports that of the 16 killed at Army camp in Uri, seven were soldiers, including a Lt Colonel and a junior commissioned officer; three were policemen; and rest six were terrorists. The attack took place at the Army's Field Ordnance Camp located at Mohra near the border town of Uri.police station in Shopian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X