కేజ్రీకి మరో షాక్: మహిళపై అసభ్యంగా ఎమ్మెల్యే, అరెస్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌‌ను పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఢిల్లీలోని దియోలి శాసనసభ్యుడు ప్రకాశ్‌ జర్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రకాశ్‌ జర్వాల్‌ చిక్కుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. 2014 మేలో కూడా ఢిల్లీ జల్‌బోర్డ్‌ జూనియర్‌ ఇంజనీర్‌పై చేయిచేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు తాను లెఫ్టినెంట్ గవర్నర్‌ను, ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను కలిశానని బాధితురాలు చెబుతున్నారు.

Fresh trouble for AAP, MLA arrested for misbehaving with woman

ఆప్ నేతలు ఇటీవలి కాలంలో వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పంజాబ్‌లో ఓ మతానికి చెందినవారి మనోభావాలు దెబ్బతీశారనే ఆరోపణలతో ఆప్‌ నేత ఆశిశ్‌ ఖేతన్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేందర్ కుమార్‌ను సిబిఐ అరెస్టు చేసింది.

ఖురాన్‌ను కించపరిచారనే ఆరోపణపై ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. తమను ఇబ్బంది పెట్టాలే ఉద్దేశంతోనే బిజెపి తమ పార్టీకి చెందినవారిని కేసుల్లో ఇరికిస్తోందని ఆప్ విమర్శిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+