Friends: స్నేహితురాలి ఇంట్లో రూ. 9 లక్షల నగలు లూటీ చేసిన గీతా ఏం చేసిందంటే ? !
బెంగళూరు/మైసూరు: కాలేజ్ లో చదువుకునే సమయంలో ఇద్దరు యువతులు స్నేహితులు అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు యువతులు వేర్వేరు యువకులను వివాహం చేసుకుని వేర్వేరు సిటీల్లో ఉంటున్నారు. బంధువు పెళ్లికి హాజరుకావడానికి ఓ మహిళ బెంగళూరు వెళ్లింది. శుభకార్యం పూర్తి అయ్యింది. కొన్ని సంవత్సరాల తరువాత పాత స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఇద్దరూ మహిళలకు మీటింగ్ పెట్టారు. ఆ సందర్బంలో తన భర్త తనకు భారీ మొత్తంలో బంగారు నగలు తీసిచ్చాడని ఇంటికి వచ్చిన స్నేహితురాలికి ఆమె చెప్పింది. బంగారు నగల డిజైన్ చూస్తానని, చెప్పిన మహిళ స్నేహితురాలి ఇంటిలో రూ. 9 లక్షల విలువైన నగలు చాకచక్యంగా ఎత్తుకుని ఎస్కేప్ అయ్యింది.

కాలేజ్ ఫ్రెండ్స్
బెంగళూరులోని కాలేజ్ లో చదువుకునే సమయంలో గీతా, లక్ష్మీ అనే యువతులు స్నేహితులు అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం గీతాకు, లక్ష్మీకి వేర్వేరు యువకులతో వివాహం జరిగింది. గీతా వివాహం చేసుకుని ఆమె భర్తతో కలిసి మైసూరు సిటీలో నివాసం ఉంటున్నది. లక్ష్మీ బెంగళూరులోని విద్యారణ్యపుర సమీపంలోని తిండ్లు ప్రాంతంలో నివాసం ఉంటున్నది.

పెళ్లికి వచ్చిన గీతా
బెంగళూరులో బంధువుల పెళ్లి ఉండటంతో నువ్వు రావాలని గీతాకు ఆమె బంధువులు చెప్పారు. బంధువు పెళ్లికి హాజరుకావడానికి బెంగళూరు వచ్చిన గీతా పెళ్లిలో అందరితో చాలా సంతోషంగా గడిపింది. శుభకార్యం పూర్తి అయిన తరువాత గీతా ఆమె స్నేహితురాలు లక్ష్మీకి ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడి నేను బెంగళూరులో ఉన్నానని చెప్పింది.

బంగారు నగలు చూసి ?
కొన్ని సంవత్సరాల తరువాత గీతా విద్యారణ్యపురలోని తిండ్లులో నివాసం ఉంటున్న పాత స్నేహితురాలి లక్ష్మీ ఇంటికి వెళ్లింది. ఆ సందర్బంలో కొన్ని గంటల పాటు గీతా, లక్ష్మీ మాట్లాడుకున్నారు. ఆ సందర్బంలో తన భర్త తనకు భారీ మొత్తంలో బంగారు నగలు తీసిచ్చాడని ఇంటికి వచ్చిన స్నేహితురాలు గీతాకు లక్ష్మీ చెప్పింది. లక్ష్మీ ఆమె బంగారు నగలు గీతాకు చూపించింది.

నగలతో జంప్ జిలాని
బంగారు నగల డిజైన్ చూస్తానని, చెప్పిన గీతా స్నేహితురాలు లక్ష్మీ ఇంటిలోని రూ. 9 లక్షల విలువైన నగలు చాకచక్యంగా ఎత్తుకుని ఎస్కేప్ అయ్యింది. చోరీ చేసిన నగలు మైసూరులో కుదవ పెట్టిన గీతా ఆ డబ్బు ఆమె అవసరాలకు వాడుకుంది. గీతా ఆచూకి తెలుసుకున్న బెంగళూరు పోలీసులు మైసూరులో ఆమెను అరెస్టు చేసి కుదవ పెట్టిన రూ. 9 లక్షల నగలు స్వాధీనం చేసుకున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications