స్టూడెంట్ ను చంపి అడవిలో శవం పాతిపెట్టిన ఫ్రెండ్స్, రాజకీయ నాయకుడి కొడుకు !
చెన్నై/ మధురై: రాజకీయ నాయకుడి కుమారుడు కాలేజ్ లో చదువుతున్నాడు. కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి తాను బయటకు వెలుతున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత అతని ఆచూకిలేదు. రంగంలోకి దిగిన పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేశారు. మాయం అయిన కాలేజ్ అబ్బాయి, రాజకీయ నాయకుడి కొడుకు దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా త్యాగతురుగం సమీపంలో కూతకుడి పంచాయతీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ జైశంకర్ పని చేస్తున్నాడు. రాజకీయ నాయకుడు అయిన జైశంకర్ కు జగన్ అనే కుమారుడు ఉన్నాడు. కడలూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జగన్ చదువుతున్నాడు. అనారోగ్యం కారణంగా గత వారం రోజులుగా కళాశాలకు వెళ్లకుండా జగన్ ఇంటిలోనే ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి వెళ్లిన జగన్ తరువాత ఇంటికి రాలేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు.

తన కుమారుడు జగన్ అదృశ్యమైనాడని రాజకీయ నాయకుడు జైశంకర్ వరంజరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో జగన్ ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ చేసిన స్థలంలో, ఆ టైమ్ లోనే అతని స్నేహితులు అయ్యప్పన్ సహా నలుగురి ఫోన్ నంబర్ల సిగ్నల్స్ కూడా అదే ప్రాంతంలో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో అయ్యప్పన్ సహా నలుగురిపై జగన్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు అనుమానం వచ్చింది.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కలకలం రేపే సమాచారం బయటకు వచ్చింది. అయ్యప్పన్‌కి, జగన్‌కి ఇప్పటికే శత్రుత్వం ఉంది. ఈ క్రమంలో అయ్యప్పన్ సహా నలుగురు వ్యక్తులు జగన్ ను తీసుకుని మద్యం తాగేందుకు కూతకుడి అడవికి వెళ్లారు. అక్కడ జగన్ విపరీతంగా మద్యం సేవించడం, మద్యం మత్తులో ఉండటంతో అయ్యప్పన్‌తోపాటు నలుగురు వ్యక్తులు జగన్‌ని బాటిల్‌తో పొడిచి చంపేశారు. అడవిలో జగన్ శవాన్ని పాతిపెట్టినట్లు అయ్యప్పన్ తో పాటు నిందితులు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
దీంతో పోలీసులు కూతకుడి అటవీ ప్రాంతానికి చేరుకుని పూడ్చిపెట్టిన జగన్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కాళ్లకురిచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అయ్యప్పన్‌తో పాటు జగన్ స్నేహితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అడవిలో మందు పార్టీ ఏర్పాటు చేసి జగన్‌ను పక్కాప్లాన్ తో హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. రాజకీయ నాయకుడి కుమారుడు, కాలేజ్ విద్యార్థి అతని ఫ్రెండ్స్ చేతిలో దారుణ హత్యకు గురికావడం కల్లకురిచ్చిలో కలకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications