Lady: వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా ఆంటీని నమ్మించి పిలుచుకుని వెళ్లి ?, స్మశానవాటికలోనే ?, సీసీటీవీల్లో !
న్యూఢిల్లీ: తీసుకున్న రుణం చెల్లించకుండా అప్పు ఇచ్చిన మహిళనే దారుణంగా హత్య చేసి శవం పోలీసులకు చిక్కకుండా పూడ్చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ మీనా వాద్వాన్ అలియాస్ మీనా (54) అనే మహిళ హత్యకు గురైంది. జనవరి 2 నుంచి మీనా కనిపించకుండా పోయింది. పోలీసులు మీనా కనపడటం లేదని కేసు నమోదు చేసి అనుమానాస్పదంగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తరువాత వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా ఆంటీ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. వడ్డీ వ్యాపారానికి సంబంధించిన విషయంలో మీనాను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మీనాను హత్య చేసిన నిందితులు తరువాత స్థానిక శ్మశానవాటికలో ఆమె శవం పాతిపెట్టామని చెప్పడంతో మీనా కుటుంబ సభ్యులు హడలిపోయారు.

వడ్డీ వ్యాపారం చేస్తున్న మీనా
నార్త్ వెస్ట్ ఢిల్లీలో పూడ్చిపెట్టిన మీనా మృతదేహాన్ని బయటకు తీశారు. మీనా హత్య కేసులోరెహాన్, మోబిన్ ఖాన్, నవీన్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హత్యకు గురైన మీనా వాధ్వన్ వడ్డీ వ్యాపారి. చిరు వ్యాపారులు, దినసరి కూలీలకు వడ్డీలకు అప్పులు ఇచ్చేది. నిందితులు మీనా వద్ద అప్పులు కూడా తీసుకున్నారు. కానీ మీనా దగ్గర అప్పు తీసుకున్న నిందితులు ఆమెకు డబ్బులు తిరిగి చెల్లించలేదు.

మాయం అయిన మీనా
దీంతో మీనా డబ్బు తిరిగి ఇవ్వాలని వారి మీద ఒత్తిడి తెచ్చింది. దీంతో రగిలిపోయిన నిందితులు ముగ్గురు మీనాను హత్య చెయ్యాలని డిసైడ్ అయ్యారు. మీనా జనవరి 2 వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. మీనా కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. కాసేపట్లో వస్తానని చెప్పి జనవరి 2న ఇంటి నుంచి వెళ్లిన మీనా వాద్వాన్ తరువాత తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. రాత్రి మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

సీసీటీవీ కెమెరాల్లో ?
మీనా ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలో కూడా వారికి ఏం జరిగిందనే దానిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేశారు.
మీనాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడు మోబిన్ ను పోలీసులు మొదట ప్రశ్నించారు. అయితే మోబిన్ దర్యాప్తుకు సహాయపడే ఎలాంటి సమాచారాన్ని పోలీసులకు చెప్పలేదు. అనంతరం మరో నిందితుడు నవీన్‌ను పట్టుకున్న పోలీసులు అతన్ని విచారించారు. మోబిన్, రెహాన్‌లతో కలిసి మీనాను హత్య చేసినట్లు నవీన్ అంగీకరించాడు.

నిందితులు ఫ్యామిలీ ఫ్రెండ్స్
ఢిల్లీలోని నంగ్లోయ్ శ్మశాన వాటికలో మీనా మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు కూడా నవీన్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మీనా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. నిందితులు ముగ్గురి గురించి మాకు బాగా తెలుసని, వీళ్లు మా కుటుంబానికి పరిచయం ఉన్నారని మీనా కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. నిందితులు పూడ్చిపెట్టిన మీనా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రూ. 5 వేలు తీసుకుని సైలెంట్
మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకొచ్చినా అక్కడి రిజిస్టర్ లో వివరాలు నమోదు చేయకపోవడంతో శ్మశానవాటిక సంరక్షకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీనా అంత్యక్రియలు జరిగిన విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండటానికి స్మశానవాటికలో పనిచేసే కాటికాపరి నిందితుల నుంచి రూ.5 వేలు తీసుకున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. తీసుకున్న రుణం చెల్లించకుండా అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి మీనాను దారుణం హత్య చెయ్యడం నార్త్ ఢిల్లీలో కలకలం రేపింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications