• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి వస్తే.. తుపాకులతోనే ఎంట్రీ.. శశికళ అర్హతేంటి?: కమల్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ అధికార పీఠం పన్నీర్ సెల్వం-శశికళ వర్గాల మధ్య దోబూచులాడుతున్న తరుణంలో.. సీన్ లోకి 'కబాలి' ఎంట్రీ అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రజనీ నోటి నుంచి ఇప్పటికైతే ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు రాకపోయినప్పటికీ.. ఆయన ఎంట్రీపై ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి.

రజనీ సంగతి పక్కనబెడితే.. మరో విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై ఆసక్తికర రీతిలో స్పందించారు. ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలు శశికళకు వ్యతిరేకంగా ఉన్నాయన్న అర్థాన్ని స్పురిస్తున్నాయి. అదే సమయంలో తాను గనుక రాజకీయాల్లోకి అడుగుపెడితే ఎలా ఉంటుందో చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Friendship with Jaya does not give Sasikala boarding pass to CM post: Kamal Hassan

ఇప్పటి వరకైతే తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని, తనలాంటి వారు గనుక రాజకీయాల్లో అడుగుపెడితే ఎంట్రీ మామూలుగా ఉండదని, తుపాకులు చేతపట్టుకుని వస్తామంటూ కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలా జరగకూడదనే తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఆరు దశాబ్దాలుగా తమిళనాడుకు రాజకీయ నాయకులు చేసిందేమి లేదని చెప్పారు. వాగ్దానాలను నిలబెట్టుకునే దిశగా ఏ పార్టీ ప్రయత్నించలేదని ఆయన ఆరోపించారు.

శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆమెకు ఎలాంటి అర్హతలున్నాయనేది సామాన్య జనానికే కాదు నాకు కూడా తెలియదని కమల్ పేర్కొన్నారు. ఏళ్ల పాటు ఒక వ్యక్తి చుట్టూ తిరగడమే తమ రాజకీయ అర్హత అని భావించకూడదన్నారు. ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు కమల్.

తాను ఓ లాయర్ కొడుకునని, అంతమాత్రాన తాను కోర్టుకు వెళ్లి వాదిస్తానంటే మూర్ఖత్వమే అవుతుందని పరోక్షంగా శశికళకు కమల్ చురకలంటించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీ అవేశం చూస్తుంటే మీలో ఒక ఔత్సాహిక రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు? అని మీడియా అడిగిన ప్రశ్నకు కమల్ తెలివిగా సమాధానం చెప్పారు.

తానెప్పుడూ అలా భావించలేదని, ఒవకేళ మీకు దేవుడిపై నమ్మకముంటే తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుకోవాలంటూ కమల్ బదులిచ్చారు.

English summary
Jumping on the O. Panneerselvam bandwagon, Tamil film icon Kamal Hassan on Wednesday said the Chief Minister has not shown any signs of “damage or incompetence so far” and suggested that he should be allowed to continue since he is the “tool to execute my democratic will.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X