రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానం.. వందల కిలోమీటర్లు నడిపించింది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానం ఓ వ్యక్తిని వందల కిలోమీటర్లు నడిపించింది. రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా కలుసుకోవాలనే బలమైన ఆకాంక్షతో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న అనే అభిమాని ఏకంగా 350 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి హైదరాబాద్ చేరుకున్నాడు. జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని నేరుగా కలిశారు. తన కలను నెరవేర్చుకున్నాడు.

తాయన్న పాదయాత్ర అక్టోబర్ 29న ఆదోని నుంచి ప్రారంభమైంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు కాలినడకన ప్రయాణించాడు. దారి పొడవునా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. భారీ వర్షంలోనూ అతని పట్టుదల సడల్లేదు. ముఖ్యమంత్రిని కలిసే వరకు విశ్రమించకూడదనే ఉద్దేశంతో రోజుకు పదుల కిలోమీటర్ల చొప్పున నడిచి తన గమ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి కలుసుకున్నాడు.

From Adoni to Hyderabad as a Fan Walks Nearly 350 km to Meet CM Revanth Reddy in Jubilee Hills

వందల కిలోమీటర్ల దూరం నుంచి తనను చూడటానికే నడిచి వచ్చానని తాయన్న వివరించడంతో రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తాయన్నతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ నాయకులకు ప్రజల నుంచి లభించే ఇలాంటి అభిమానమే నిరంతరం ప్రజాసేవలో ముందుకు సాగేందుకు కొండంత శక్తినిస్తుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు- ఉక్కుపాదంతో అణచివేయక తప్పదు: పీసీసీకి సుప్రీంకోర్టు చీవాట్లు
మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు- ఉక్కుపాదంతో అణచివేయక తప్పదు: పీసీసీకి సుప్రీంకోర్టు చీవాట్లు

తాయన్నకు రేవంత్ రెడ్డి స్వయంగా శాలువా కప్పి ఆత్మీయంగా అభినందించారు. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా శాలువాతో సత్కరించడం, ఎంతో ఆప్యాయంగా పలకరించడంతో తాయన్న భావోద్వేగానికి గురయ్యాడు. తన పట్ల రేవంత్ రెడ్డి చూపిన ఆదరణ తన ప్రయాణ శ్రమనంతటినీ మరిచిపోయేలా చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తెలుగు రాష్ట్రాల మధ్య భౌగోళిక సరిహద్దులు ఉన్నప్పటికీ.. నాయకులపై ప్రజల్లో ఉండే అభిమానం ప్రాంతాలకు అతీతమని ఈ సంఘటన నిరూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+