మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు- ఉక్కుపాదంతో అణచివేయక తప్పదు: పీసీసీకి సుప్రీంకోర్టు చీవాట్లు

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ లో అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పోస్టును ప్రచురించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక ఖాతా నుంచి వెలువడిన ఈ పోస్టును సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. కమిటీ పదాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానాల ప్రతిష్టను దిగజార్చేలా సాగే ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని విస్పష్టంగా ప్రకటించింది.

ఈ అంశంపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎమ్ పంచోలీతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కొద్దిసేపటి కిందటే విచారణను చేపట్టింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ పార్టీ వాదనలను వినిపించారు. పార్టీ అగ్రనాయకత్వం అనుమతి లేకుండానే ఆ పోస్టు సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయిందని, విషయం తెలిసిన వెంటనే దానిని తొలగించడమే కాకుండా బేషరతుగా క్షమాపణ కోరామని బెంచ్ కు కోర్టుకు విన్నవించారు.

Any attempt to undermine the authority of court needs to be dealt with iron hand says Supreme Court

ఈ క్షమాపణపై జస్టిస్ అరవింద్ కుమార్ స్పందించారు. ఆ క్షమాపణ పత్రం కాగితంపై నుంచి వచ్చిందా లేదా హృదయపూర్వకంగా కోరిందా అనే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని, ఏ ఒక్క వ్యక్తి లేదా రాజకీయ పార్టీ కూడా దీనికి గానీ, చట్టానికి గానీ ఎంతమాత్రం అతీతం కాదని బెంచ్ తేల్చి చెప్పింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది రాజకీయ లబ్ధి కోసమో, ఒకరి సౌలభ్యం కోసమో ఉపయోగపడేది కాదని స్పష్టం చేసింది.

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం: ప్రాధాన్యతలు
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం: ప్రాధాన్యతలు

రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడటం ప్రజాస్వామ్యంలో అత్యంత ఆవశ్యకమని ధర్మాసనం పేర్కొంది. న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపై విమర్శలు చేసే హక్కు పౌరులు, సంస్థలకు ఉంటుందని, ఆ భావప్రకటన స్వేచ్ఛ జ్యుడీషియరీకి ఆటంకం కలిగించేలా, బెదిరింపులకు గురిచేసేలా వాడుకోలేరని బెంచ్ పేర్కొంది. రాజ్యాంగం, చట్టబద్ధంగా న్యాయస్థానాలకు సంక్రమించిన అధికారాలు, ప్రాబల్యాన్ని తగ్గించడానికి గానీ, న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా ఉక్కుపాదంతో అణచివేయక తప్పదని హెచ్చరించింది.

రూ. 40 కోట్లు + కేప్టెన్సీ ఇస్తేనే ఉంటాం: ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ల రచ్చ
రూ. 40 కోట్లు + కేప్టెన్సీ ఇస్తేనే ఉంటాం: ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ల రచ్చ

న్యాయస్థానాల అధికారానికి లేదా మనుగడకు ఏ రాజకీయ పార్టీ మద్దతు గానీ, ధృవీకరణ గానీ అవసరం లేదని, అది పూర్తిగా రూల్ ఆఫ్ లా పైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎక్కడైతే జ్యుడీషియరీ వ్యవస్థీకృతమై ఉంటుందో, అక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం వివరించింది. న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో పెరిగిపోతున్న అనుచిత వ్యాఖ్యల పట్ల ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

నేడు ధన్‌తేరస్- భారీగా తగ్గిన పసిడి రేట్లు: ఇంకెందుకు ఆలస్యం
నేడు ధన్‌తేరస్- భారీగా తగ్గిన పసిడి రేట్లు: ఇంకెందుకు ఆలస్యం

ఈ ఘటనపై 1971 కోర్టు ధిక్కరణ చట్టం కింద సివిల్ లేదా క్రిమినల్ ధిక్కరణ చర్యలు చేపట్టడానికి తగిన ఆధారాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించేందుకు ధర్మాసనం సీనియర్ న్యాయవాదులను అమికస్ క్యూరీగా నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం విచారణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, కోర్టుకు తగిన సహకారాన్ని అందించడానికి అటార్నీ జనరల్ సహాయాన్ని కూడా న్యాయస్థానం కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+