లక్కంటే నీదే గురూ.. కూరగాయలు అమ్మే వ్యక్తికి రూ. 11 కోట్ల జాక్ పాట్..
కూరగాయలు అమ్మే వ్యక్తి రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. ఏకంగా రూ. 11 కోట్ల జాక్ పాట్ కొట్టాడు. తన ఫ్రెండ్ సలహాతో ఇప్పుడు ఆయన లైఫ్ ఛేంజ్ అయిపోయింది. రాజస్థాన్ జైపూర్ లోని కోట్ పుత్లీ అనే చిన్న గ్రామానికి చెందిన అమిత్ షెహ్రా.. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ రోజు తన స్నేహితుడు ముఖేశ్ తో కలిసి పని మీద భటిండా వెళ్తాడు. అక్కడ టీ తాగుదామని ఓ చోట ఆగుతారు. కానీ ఆ క్షణంలోనే అతడి లైఫ్ మారిపోతుందని ఊహించలేదు.
అక్కడే భటిండా లో రత్తన్ లాటరీ డిస్ట్రిబ్యూటర్ వద్ద లాటరీ టికెట్స్ తీసుకోమని ముఖేశ్.. అమిత్ కు సలహా ఇస్తాడు. అయితే అమిత్ వద్ద డబ్బులు లేకపోవడంతో ముఖేశ్ డబ్బు ఇచ్చాడు. రూ. 1000 తో తన పేరు మీద, అలాగే తన భార్య పేరు మీద లాటరీ టికెట్ తీసుకుంటాడు అమిత్. అయితే ఆ సమయంలో అమిత్ నవ్వుతూ.. లాటరీ గెలిస్తే.. నీ పిల్లలకు రూ. కోటి ఇస్తానని ముఖేశ్ తో చెబుతాడు.. కానీ ఇప్పుడు ఆ మాటలు నిజం కావడంతో అమిత్ సంతోషం అంతా ఇంతా కాదు.
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31 న దివాళీ బంపర్ డ్రా పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించింది. అయితే ఫలితాలు రాగానే విన్నింగ్ ఏ సిరీస్ నెంబర్ 438586 ది అమిత్ టికెట్ గెలిచింది. అయితే అమిత్ సెల్ ఫోన్ రిపేర్ కావడంతో ముఖేశ్ ఇంటికొచ్చి అమిత్ కు జరిగిన విషయం చెప్పాడు. లాటరీలో రూ. 11 కోట్లు గెలుచుకున్నావని చెప్పడంతో జోక్ చేస్తున్నాడని అనుకున్నానని అమిత్ తెలిపాడు. కానీ ఒకటికి రెండు సార్లు నెంబర్లు చెక్ చేసుకున్నాక నిజంగానే జాక్ పాట్ కొట్టానని అర్థమైందని చెప్పుకొచ్చాడు.

మొత్తం రూ. 11 కోట్లలో 30 శాతం పన్ను ప్రభుత్వం చెల్లించుకుంటుంది. రూ. 7.7 కోట్లు అమిత్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఇక కూరగాయల వ్యాపారం చేసే అమిత్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ మొత్తం డబ్బును తమ పిల్లల చదువులకు ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు అమిత్.












Click it and Unblock the Notifications