ఢిల్లీ కేంద్రంగా జగన్, చంద్రబాబు సెంటిమెంట్- హిస్టరీ రిపీట్..!!
ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పార్లమెంట్ వేదికగా కేంద్రం జమిలి ఎన్నిక ల దిశగా అడుగులు వేస్తోంది. మహారాష్ట్రలో విజయంతో బీజేపీ కూటమిలో జోష్ పెరిగింది. ఇటు కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ లో విజయం సాధించింది. ఇక, ఢిల్లీ .. బీహార్ ఎన్నికల దిశగా రెండు కూటములు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికల వేళ జగన్, సోరెన్, చంద్రబాబు సెంటిమెంట్ కొనసాగితే.. కాబోయే సీఎం ఎవరనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. సీఎం ఆయనకే ఖాయమనే వాదన వినిపిస్తోంది.
మారుతున్న సమీకరణాలు
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. జార్ఖండ్ లో కొత్త సీఎంగా సోరెన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి కొలువు తీరనుంది. ఇటు పార్లమెంట్ లో జమిలి బిల్లు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇండియా కూటమి జమిలి ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లులు ఉంటాయని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఈ సమయంలోనే మరో రెండు రాష్ట్రాల ఎన్నికల పైన ఢిల్లీలో చర్చ జరుగుతోంది. జనవరి - ఫిబ్రవరిలో ఢిల్లీతో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దిశగా ఇప్పటికే రెండు రాష్ట్రాలలోనూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

జగన్ - చంద్రబాబు అంశంలో
ఇక, ఆప్ కు ఈ సారి ఢిల్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఢిల్లీలో విజయం బీజేపీ సైతం కీలకంగా మారుతోంది. అయితే, ఇక్కడ సెంటిమెంట్ అంశం తెర మీదకు వస్తోంది. జైలు జీవితం గడిపిన నేతల పైన ప్రజల్లో సానుభూతి కనిపిస్తోందని.. అధికారం కట్టబెడుతున్నారనే చర్చ వినిపిస్తోంది. రాజకీయ కారణాలతోనే తమ నేతలను జైలుకు పంపుతున్నారనే అభిప్రాయం పలు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా పరోక్షంగా స్పష్టం చేసారు. 2019, 2024 లో జగన్ - చంద్రబాబు వరుసగా ఏపీలో విజయం వెనుక జైలు కు వెళ్లటమే కారణమనే విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ లోనూ సోరెన్ ను జైలుకు పంపటమే ఆయన విజయాని కి కారణమని పొలిటికల్ సర్కిల్స్ అంచనా.

సెంటిమెంట్ వర్కువుట్ అయ్యేనా
ఇక, ఢిల్లీలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ కేసులో జైలు జీవితం అనుభవించాల్సి ఉంది. ఆప్ కు చెందిన పలువురు నేతలతో పాటుగా సౌత్ గ్రూపుకు చెందిన వారు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో బెయిల్ తో బయటకు వచ్చారు. అయితే, ఏపీ.. జార్ఖండ్ లో ప్రచారం ఉన్నట్లుగా జైలు జీవితం ఎన్నికల్లో ఓట్లుగా మారితే ఢిల్లీలో కేజ్రీవాల్ కు అనుకూలంగా మారుతుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఇతర పార్టీల కంటే ఆప్ ముందుగా అభ్యర్ధుల ఖరారు.. ప్రచారం పైన ఫోకస్ చేసింది. హర్యానాలో ఆప్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్ లో ఉప ఎన్నికల్లో పట్టు నిరూపించుకుంది. దీంతో, జైలు సెంటిమెంట్ వర్కవుట్ అయితే కేజ్రీవాల్ దే గెలుపు అనేది ఏ మేర పని చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications