• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్: కులం, బోయ్‌ప్రెండ్‌ ఎవరంటూ నెటిజన్ల సెర్చింగ్

By Narsimha
|

న్యూఢిల్లీ: 17 ఏళ్ళ తర్వాత మిస్ వరల్డ్ కిరీటం ఇండియాకు దక్కింది. అయితే ఇండియాకు చెందిన మానుషి చిల్లర్ గురించి నెటిజన్లు వెతుకుతున్నారు. మానుషి చిల్లర్ జీవిత చరిత్ర, ఆమె కుటుంబం, ఆమె బాల్యం తదితర అంశాలపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.ఆమె గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొనేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.

మిస్ వరల్డ్ కిరీటాన్ని ఇండియాలోని హర్యానా రాష్ట్రానికి చెందిన మానుషి చిల్లర్ దక్కించుకొన్నారు. 17 ఏళ్ళ తర్వాత ఇండియాకు ఈ కిరీటం దక్కింది. అయితే ఈ కిరీటాన్ని మానుషి చిల్లర్ దక్కించుకొన్న తర్వాత మరోసారి ఇండియా పేరు మార్కోగిపోతోంది.

రాత్రికి రాత్రే అందాల పోటీలో అగ్రస్థానానికి చేరుకొన్న మానుషి చిల్లర్ గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు ఆసక్తిని చూపుతున్నారు. ఇండియాకు చెందిన వారే కాకుండా ప్రపంచ దేశాల నుండి మానుషి చిల్లర్ గురించి విషయాలను తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

 మానుషి చిల్లర్ గురించి సెర్చింగ్

మానుషి చిల్లర్ గురించి సెర్చింగ్

మిస్ వరల్డ్‌గా మానుషి చిల్లర్ ఎన్నికైన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతుహలం పెరిగిపోయింది. ఆమె గురించి తెలుసుకొనేందుకు సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబం గురించి కూడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆమె కులం, బాల్యం, ఆమెకు బోయ్‌ఫ్రెండ్ ఉన్నారా, ఎక్కడ చదువుకున్నారనే విషయాలపై కూడ ఆరా తీస్తున్నారు. ఇండియాతో పాటు చైనాలాంటి దేశాల్లో కూడ ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. మానుషి చిల్లర్ గురించి సెర్చింగ్‌లో ఆమె కులం, బోయ్ ప్రెండ్ గురించి అత్యధికంగా సెర్చ్ చేసినట్టు గూగుల్ సూచిస్తోంది.

 చదువులో కూడ మానుషి టాప్

చదువులో కూడ మానుషి టాప్

న్యూఢిల్లీలోని సెయింట్ థామ‌స్ స్కూల్‌లో మానుషి చిల్లర్ చ‌దువుకుంది. 12వ త‌రగ‌తి ప‌రీక్ష‌ల్లో 96 శాతం మార్కులతో మానుషి పాసైంది. లెజండ‌రీ డ్యాన్స‌ర్లు రాజా, రాధా రెడ్డి, కౌస‌ల్యా రెడ్డిల ద‌గ్గ‌ర మానుషి కూచిపూడిలో శిక్ష‌ణ పొందింది. నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో కూడా ఆమె చ‌దువుకుంది.

 కవిత్వం, చిత్రలేఖనంలో కూడ మానుషికి ప్రావీణ్యం

కవిత్వం, చిత్రలేఖనంలో కూడ మానుషికి ప్రావీణ్యం

ఫ్యాష‌న్‌, మోడ‌లింగ్ మాత్ర‌మే కాకుండా మానుషికి క‌విత్వం, చిత్ర‌లేఖ‌నంలోనూ ప్రావీణ్యం ఉంది. 2014లో జ‌పాన్‌లో జ‌రిగిన క‌ల్చ‌ర‌ల్ ఎక్స్చేంజ్ కార్య‌క్ర‌మంలో మానుషి భార‌త్ తర‌ఫున పాల్గొంది. ప్ర‌స్తుతం సోనెప‌ట్‌లోని ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌లో మానుషి ఎంబీబీఎస్ చేస్తోంది. కార్డియాక్ స‌ర్జ‌న్ అవ్వాల‌నేది ఆమె ల‌క్ష్యం. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో 'మిస్ క్యాంప‌స్ ప్రిన్సెస్‌'గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 'మిస్ హ‌ర్యానా'గా, జూన్‌లో జ‌రిగిన మిస్ ఇండియా పోటీల్లో 'మిస్ ఫొటోజెనిక్‌'గా మానుషి ఎంపికైంది.

 మానుషి తండ్రి ప్రోఫెసర్

మానుషి తండ్రి ప్రోఫెసర్

మిస్ వరల్డ్‌గా ఎంపికైన మానుషి చిల్ల‌ర్ హర్యానాలోని రోహ్‌త‌క్‌లో 1997, మే 14న జ‌న్మించింది. ఆమె తండ్రి డాక్ట‌ర్‌ మిత్ర బ‌సు చిల్ల‌ర్. మానుషి చిల్లర్ తండ్రి మిత్ర బసు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌లో శాస్త్ర‌వేత్త‌. త‌ల్లి డాక్ట‌ర్ నీల‌మ్ చిల్ల‌ర్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ బిహేవియ‌ర్ అండ్ ఆలీడ్ సైన్సెస్‌లో న్యూరో కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మానుషికి ఒక త‌మ్ముడు, చెల్లి ఉన్నారు.

English summary
After winning the Femina Miss India title, Manushi Chhillar created history by claiming the Miss World 2017 crown. The gorgeous diva from Haryana has been receiving congratulatory messages from across the globe.Social media is abuzz with praises for Manushi, who made the entire nation proud. Apart from her beauty, the Miss World 2017 is also being much appreciated for her winning answer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more