ఏటీఎంకు దండేసి.. దండం పెట్టారు..
ఢిల్లీ: దేశంలో నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల తరబడి వేచియున్నా.. డబ్బు చేతికి అందుతుందో లేదో తెలియని పరిస్థితి. చాలాచోట్ల ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తుండడంతో.. సామాన్యుల్లో అసహనం తీవ్రంగా పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలోనే వినూత్న నిరసనలకు తెరదీస్తున్నారు పలువురు. మొన్నామధ్య కొంతమంది యువకులు కేరళలో ఓ ఏటీఎంకు అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించగా.. తాజాగా తూర్పు ఢిల్లీలోని జగతిపుర ప్రజలు ఓ ఎస్‌బీఐ ఏటీఎంకు దండేసి దండం పెట్టారు. ఏటీఎంకు పూలమాల వేసి హారతి పట్టారు. నోట్ల రద్దు నాటి నుంచి నేటి వరకు ఈ ఏటీఎంలో డబ్బులే పెట్టలేదని దీనివల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పూజలు నిర్వహించిన వ్యక్తులు చెబుతున్నారు.

దాదాపు 50మంది దాకా ఈ పూజ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటీఎంకు పూలమాల వేసి, హారతి ఇచ్చి దండం పెట్టారు. మరి వీళ్ల నిరసనతోనైనా సదరు ఏటీఎం సిబ్బంది అందులో క్యాష్ పెడుతారో లేదో చూడాలి!












Click it and Unblock the Notifications